Pawan Kalyan: రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌.. ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో హోరెత్తుతోన్న థియేటర్స్

జైలర్‌ సినిమాలో సెకెండ్‌ హాఫ్లో సునీల్‌, తమన్నాల ట్రాక్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సినిమాలో వీరిద్దరూ యాక్టర్స్‌ గానే నటించడం విశేషం. ఈ ఇద్దరితో సినిమా తీసే దర్శకుడిగా కమెడియన్‌ సునీల్‌ రెడ్డి కనిపిస్తాడు. అయితే సినిమాలో ఈ క్యారెక్టర్‌కి విగ్‌ ఉంటుంది. దానిని ఉద్దేశించి సునీల్‌ ' పవన్ కల్యాణ్‌ లాగా ఆ హెయిర్ స్టైల్‌ ఏంటి' అంటూ ఒక డైలాగ్‌ చెబుతాడు. ఇలా సునీల్‌ నోట పవన్‌ పేరు రాగానే థియేటర్లలో అరుపులు, విజిల్స్‌ పడుతున్నాయి.

Pawan Kalyan: రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌.. ఫ్యాన్స్‌ అరుపులు, కేకలతో హోరెత్తుతోన్న థియేటర్స్
Rajinikanth, Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Aug 12, 2023 | 6:20 AM

రజనీకాంత్ నటించిన జైలర్‌ సినిమా గురువారం (ఆగస్టు 11)న గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షోతోనే సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మొదటి రోజే ఏకంగా 70కోట్లకు పైగా వసూళ్లు సాధించి రజనీ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది జైలర్‌. తమిళంలోనే కాదు తెలుగులోనూ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రన్‌ అవుతోంది రజనీ సినిమా. చాన్నాళ్ల తర్వాత తమ సూపర్‌స్టార్‌కు సాలిడ్‌ హిట్‌ పడడంతో అభిమానులు కూడా ఫుల్‌ ఖుషిలో ఉన్నారు. నెల్సన్‌ తెరకెక్కించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, తమన్నా వంటి స్టార్‌ నటులు ఉన్నారు. ఇక అనిరుధ్‌ అందించిన బీజీఎంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయంటున్నారు ఫ్యాన్స్‌. కాగా జైలర్‌ మూవీలో పవన్‌ కల్యాణ్‌ గురించి కూడా ప్రస్తావన ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ‘మా పవర్‌ స్టార్‌ క్రేజ్‌ ఇది ‘అంటూ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. వివరాల్లోకి వెళితే.. జైలర్‌ సినిమాలో సెకెండ్‌ హాఫ్లో సునీల్‌, తమన్నాల ట్రాక్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ సినిమాలో వీరిద్దరూ యాక్టర్స్‌ గానే నటించడం విశేషం. ఈ ఇద్దరితో సినిమా తీసే దర్శకుడిగా కమెడియన్‌ సునీల్‌ రెడ్డి కనిపిస్తాడు. అయితే సినిమాలో ఈ క్యారెక్టర్‌కి విగ్‌ ఉంటుంది. దానిని ఉద్దేశించి సునీల్‌ ‘ పవన్ కల్యాణ్‌ లాగా ఆ హెయిర్ స్టైల్‌ ఏంటి’ అంటూ ఒక డైలాగ్‌ చెబుతాడు. ఇలా సునీల్‌ నోట పవన్‌ పేరు రాగానే థియేటర్లలో అరుపులు, విజిల్స్‌ పడుతున్నాయి.

సాధారణంగా ఏదైనా రెఫరెన్స్‌ కోసం తెలుగు ప్రేక్షకులకు తెలుగు స్టార్ హీరోల పేర్లు.. తమిళ ఆడియన్స్ కి తమిళ స్టార్ హీరోల పేర్లు వాడుతారు. కానీ జైలర్‌ సినిమాలో రెండు తెలుగుతో పాటు తమిళ్‌ భాషలోనూ పవన్‌ కల్యాణ్‌ పేరునే వాడారు మేకర్స్‌. దీంతో పవన్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. పవన్‌ క్రేజ్ అంటే అలాంటిది మరి అంటూ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు. ఇక శుక్రవారం విడుదలైన భోళా శంకర్‌ సినిమాలోనూ పవన్‌ మేనియా కనిపిస్తోంది. ఈ మూవీలో మెగాస్టార్‌ చిరంజీవి చాలా సీన్లలో పవన్‌ను ఇమిటేట్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించాడు. ముఖ్యంగా ఖుషి నడుము సీన్‌ రీక్రియేషన్‌ను చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. కాగా బ్రో సినిమా తర్వాత ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, ఓజీ సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కల్యాణ్‌. హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్‌ సింగ్‌లో శ్రీలీల నటిస్తోంది. ఇక సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న ఓజీలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ పవన్‌తో కలిసి సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..