Ajith Kumar: పది సంవత్సరాలుగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న అజిత్.. మనసును కదిలించిన ఆ ఒక్క ఘటనే కారణం..

ఇటీవల వాలిమై సినిమాతో అలరించిన అజిత్.. ఇప్పుడు తునీవు సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళనాడులో అజిత్.. విజయ్ ఫ్యాన్స్ రచ్చ ప్రారంభించేశారు.

Ajith Kumar: పది సంవత్సరాలుగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న అజిత్.. మనసును కదిలించిన ఆ ఒక్క ఘటనే కారణం..
Ajith Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2023 | 9:16 AM

అజిత్ కుమార్.. రీల్ లైఫ్‏లోనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ నిజమైన హీరో. సినిమాల ఎంపికలో ఆయన స్టైల్ వేరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తమిళంలో అగ్రకథానాయికుడిగా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి. ఇటీవల వాలిమై సినిమాతో అలరించిన అజిత్.. ఇప్పుడు తునీవు సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళనాడులో అజిత్.. విజయ్ ఫ్యాన్స్ రచ్చ ప్రారంభించేశారు. అటు తునీవు విడుదల రోజే విజయ్ దళపతి నటించిన వరిసు కూడా రిలీజ్ కానుంది. దీంతో పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు షూరు చేశారు ఇరువురి అభిమానులు. చెన్నైలో ఎక్కడా చూసిన విజయ్, అజిత్ పోస్టర్స్, బ్యానర్లు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా అభిమానులను కలుస్తూ.. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు విజయ్. ఇటీవల జరిగిన వరిసు ఆడియో లాంచ్‏లో ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అజిత్ మాత్రం ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈహీరో తన సినిమా ప్రమోషన్లలో అస్సలు కనిపించడు. దాదాపు పది సంవత్సరాలుగా అజిత్ నేరుగా చిత్ర ప్రచారాలు చేయలేదు. ఈవెంట్లలో కూడా పాల్గొనలేదు. ఇందుకు ఓ బలమైన కారణం కూడా ఉందండోయ్.

ఓ మంచి సినిమాకు ప్రమోషన్ అవసరం లేదు అనే ఫార్ములాతో ముందుకు వెళ్తుంటారు హీరో అజిత్. అనేక సంవత్సరాలు ఆయన ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్, ప్రీరిలీజ్ ఈవెంట్లలో పాల్గోనడం లేదు. ఇందుకు చాలా పెద్ద కారణమే ఉంది. తమిళనాడులో విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎల్లప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక తమ హీరోస్ సినిమాల విడుదల సమయంలో వీరు చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతుంటుంది. గతంలో అజిత్, విజయ్ ల అభిమానులు రోడ్లపై గొడవపడ్డారు.

ఇవి కూడా చదవండి

చిన్నగా మొదలైన ఈ వివాదం క్రమంగా కొట్టుకునేవరకు చేరింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మృతి చెందారు. అయితే అభిమానుల మధ్య ఈ గొడవలను ఆపాలని.. వారు ఇంకెప్పటికీ ఇలా హింసాత్మకంగా ప్రవర్తించకుండా ఉండేందుకు తాను వ్యక్తిగతంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి సినిమాను పూర్తిచేసి పక్కకు తప్పుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి ప్రమోషన్ చేయరు. సినిమాకు సంబంధించిన ఎలాంటి ఈవెంట్లలో పాల్గొనరు. అటు సోషల్ మీడియాకు కూడా అజిత్ దూరంగా ఉంటారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని.. వారు మంచి సినిమాలను ఎప్పుడూ ప్రేమిస్తారని అంటుంటారు అజిత్.