Shruti Haasan: ‘ఆ సమయంలో ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాను’.. ఆసక్తకిర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంతోపాటు.. బాలయ్య నటిస్తోన్న వీరసింహ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రాల్లో కనిపించనుంది శ్రుతి. ఓవైపు సలార్ చిత్రీకరణ జరుగుతుండగా.. మరోవైపు బాలయ్య, చిరు సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నాయి.

Shruti Haasan: 'ఆ సమయంలో ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాను'.. ఆసక్తకిర కామెంట్స్ చేసిన శ్రుతి హాసన్..
Shruti Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 7:13 AM

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న శ్రుతి హాసన్.. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా అయ్యింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంతోపాటు.. బాలయ్య నటిస్తోన్న వీరసింహ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రాల్లో కనిపించనుంది శ్రుతి. ఓవైపు సలార్ చిత్రీకరణ జరుగుతుండగా.. మరోవైపు బాలయ్య, చిరు సినిమాలు సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు.. వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే చిరు, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన  నువ్వు శ్రీదేవి అయితే.. ఆ ఆయితే నేనే చిరంజీవి అవుతా .. అంటూ సాగే పాటను ఫ్రాన్స్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆసక్తికర వీడియోను షేర్ చేసుకున్నారు చిరు. ఈ సాంగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ పంచుకుంది శ్రుతి.

తాజాగా శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డిగ్రీల చలి ఉందని.. ఆ పాటకోసం ముఖ్యంగా చీరలో ఆ వాతావరణంలో డాన్స్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చింది. కానీ అభిమానుల కోసం చేయాల్సిందేనని తెలిపారు. ఆ మంచులో మరో పాట కోసం డాన్స్ చేయనవసరం లేదనుకున్నా.. ఎందుకంటే ఆ వాతావరణంలో ఎంతో ఆసౌకర్యంగా ఫీలయ్యాను. కానీ ప్రేక్షకులకు నచ్చేలా మేము తప్పకుండా చేయాల్సిందే. మైనల్ డిగ్రీల చలిలో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న వాల్తేరు వీరయ్య ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.