Vijay Thalapathy: రష్మికపై ప్రశంసలు.. స్టేజ్ పైనే హీరోయిన్‏కు దిష్టి తీసేసిన హీరో విజయ్ దళపతి..

వరిసు సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.

Vijay Thalapathy: రష్మికపై ప్రశంసలు.. స్టేజ్ పైనే హీరోయిన్‏కు దిష్టి తీసేసిన హీరో విజయ్ దళపతి..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2023 | 6:56 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా వరిసు. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు.. తెలుగులోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. మరోవైపు చిత్ర ప్రచార కార్యక్రమాలు షూరు చేసింది యూనిట్. ఇటీవల ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ఘనంగా ఆడియో లాంచ్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో స్పీచ్ ఇస్తున్న విజయ్ స్టేజ్ పైనే రష్మికకు దిష్టి తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈ చిత్రంలోని రంజితమే.. రంజితమే.. సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది. సోషల్ మీడియాలో ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక ఈ పాటకు డాన్స్ చేసి వావ్ అనిపించింది. అభిమానుల కోసం డాన్స్ చేయాలని కోరడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో కలిసి ఈ పాటకు స్టెప్పులేసింది. వీరిద్దరి డాన్స్ అక్కడున్నవారందరిని ఆకట్టుకుంది.అనంతరం విజయ్ మాట్లాడుతూ.. రష్మికపై ప్రశంసలు కురిపించాడు.

ఇవి కూడా చదవండి

రష్మిక మంచి నటి అని.. రీల్.. రియల్ లైఫ్ లోనూ ఒకేలా ఉంటుందని అన్నారు. అగ్రకథానాయిక అయిన ఎంతో ఒదిగి ఉంటుందని.. ఇప్పుడు అభిమానుల అందరి కోసం లైవ్ లో డాన్స్ చేసి ఆకట్టుకుందని.. ఆమెపై అందరి దృష్టి పడకుండా దిష్టి తీస్తున్నా అంటూ సరదాగా మాట్లాడారు విజయ్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.