Siva Karthikeyan: భారీగా నష్టాలను మిగిల్చిన ప్రిన్స్.. వారికి అండగా నిలిచిన హీరో శివకార్తికేయన్..

తమిళ్ స్టార్ శివకార్తికేయన్ ప్రదాన పాత్రలో తెరకెక్కించిన ఈ మూవీ తెలుగుతోపాటు.. తమిళంలో అక్టోబర్ 21న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో భారీగానే నష్టాలు మూటగట్టుకుంది. దాదాపు రూ. 12 కోట్లు మేర నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Siva Karthikeyan: భారీగా నష్టాలను మిగిల్చిన ప్రిన్స్.. వారికి అండగా నిలిచిన హీరో శివకార్తికేయన్..
Prince Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2023 | 8:34 AM

జాతిరత్నాలు సినిమా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు డైరెక్టర్ అనుదీప్ కెవి. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ , ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కోవిడ్ లాక్ డౌన్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఇటీవల ఆయన రూపొందించిన చిత్రం ప్రిన్స్. తమిళ్ స్టార్ శివకార్తికేయన్ ప్రదాన పాత్రలో తెరకెక్కించిన ఈ మూవీ తెలుగుతోపాటు.. తమిళంలో అక్టోబర్ 21న విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో భారీగానే నష్టాలు మూటగట్టుకుంది. దాదాపు రూ. 12 కోట్లు మేర నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నష్టాల విషయంలో హీరో శివకార్తికేయన్ ముందుకొచ్చాడట.

ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు హీరో శివకార్తికేయన్ అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు వారు నష్టపోయిన మొత్తంలో సగం వెనక్కు ఇచ్చేశాడట. అంటే దాదాపు రూ. 6 కోట్ల మేర వారికి తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఇందులో ఉక్రెయిన్ బ్యూటీ మారియా కథానాయికగా నటించింది.

శివకార్తికేయన్ కు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సక్సెస్ అయ్యాయి. ఇక మొదటిసారి తెలుగులో నేరుగా ప్రిన్స్ సినిమాను చేశారు శివకార్తికేయన్. కానీ ఈ మూవీ ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.