J Y Nagi Reddy

J Y Nagi Reddy

Senior Correspondent - TV9 Telugu

nagireddy.jonnagiri@tv9.com

తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడులో రిపోర్టర్ గా కెరీర్ ప్రారంభం అయింది. 2001 నుంచి ఈనాడు, 2003 నుంచి ఈటీవీ 2 లో , 2003 డిసెంబర్ లో టీవీ9 లో జాయిన్ అయ్యి ,కొనసాగుతున్నను . ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra Pradesh: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. చివరికి

Andhra Pradesh: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. చివరికి

Nandyal News: నంద్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచోసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోమని అడగ్గానే ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపం చెందిన వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నంద్యాల టూ టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన కుమార్తె పేరు శ్రావణి. అయితే కూతురు శ్రావణి వైఎస్సార్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో బీహెచ్ఎమ్ఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

Leopards In Nandyala: గ్రామ సమీపంలో చిరుతల సంచారం.. స్థానికులు గజగజ..! పట్టించుకోని అధికారయంత్రాంగం..

Leopards In Nandyala: గ్రామ సమీపంలో చిరుతల సంచారం.. స్థానికులు గజగజ..! పట్టించుకోని అధికారయంత్రాంగం..

నంద్యాల జిల్లా, రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల క్రితం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో చిరుత పులి సంచరించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని అడవిలోకి తిరిగి పంపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరికొన్ని చిరుతపులులు అటవీ సమీప గ్రామాలైన పెద్ద కంబలూరు సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తూ రైతులను గడగడలాడి..

Srisailam Rush: శ్రావణ శోభను సంతరించుకున్న శ్రీశైలం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.. 8 గంటల సమయం

Srisailam Rush: శ్రావణ శోభను సంతరించుకున్న శ్రీశైలం.. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు.. 8 గంటల సమయం

మల్లన్న దర్శనం కోసం భక్తులు దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.  శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Kurnool: దారి తప్పి పంట పొలాల్లోకి వచ్చిన జింక పిల్ల.. అటాక్ చేసిన కుక్కలు.. ఆ తర్వాత

Kurnool: దారి తప్పి పంట పొలాల్లోకి వచ్చిన జింక పిల్ల.. అటాక్ చేసిన కుక్కలు.. ఆ తర్వాత

రోజుల వయస్సున్న జింక పిల్ల దారి తప్పి.. గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చింది. దీంతో ఊర కుక్కలు చెలరేగిపోయాయి. ఆ పసి జింకపై దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనను అటుగా వెళ్తున్న యువకుడు గమనించాడు. కుక్కలను చెదరగొట్టి.. ఆ జింక పిల్లను కాపాడాడు. పాపం ఆ బుల్లి జింక గాయాలతో బాధ పడుతుంటే దానికి చికిత్స చేయించాడు. అది కోలుకోవడంతో.. తిరిగి దాన్ని పోలీసులకు అప్పగించాడు. దీంతో అతడిని పలువురు అభినందించారు.

Chain snatchers: రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. షాక్ కు గురిచేస్తున్న సీసీ కెమెరా విజువల్స్.

Chain snatchers: రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్.. షాక్ కు గురిచేస్తున్న సీసీ కెమెరా విజువల్స్.

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చైన్స్ స్నాచర్ లు హల్చల్ చేశారు తెల్లవారుజామున పాతపేట, తారకరామారావు నగర్ లో రెండు కాలనీలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడటంతో పట్టణ ప్రజలు భయాందోళన గురవుతున్నారు దొంగలు తెల్లవారుజామున మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను ఎత్తుకెళ్లారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చైన్ స్నాచింగ్ పై జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: ఆ సమస్యలు తీరుతాయని కొన్నేళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న ఊరి ప్రజలు..

Andhra Pradesh: ఆ సమస్యలు తీరుతాయని కొన్నేళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్న ఊరి ప్రజలు..

కర్నూలు జిల్లా వింత ఆచారాలకు, పద్ధతులకు నిలువు. ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎదో ఒక ఊరిలో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటే కొన్ని సంప్రదాయంగా ఉంటాయి. ఇంకొన్ని ఇబ్బందికరంగా కుడా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి వింత ఆచారాన్ని చూడబోతున్నాం. దీన్ని నమ్మకం అనాలో మూఢనమ్మకం అనాలో అర్థం కానీ పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు పాటించే ఆచారం అలాంటింది.

AP News: ప్రభుత్వ పాఠశాలలో కూలిన గోడ.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

AP News: ప్రభుత్వ పాఠశాలలో కూలిన గోడ.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం హుసేనాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గది గోడ కూలిపోయింది. విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం శిదిలావస్థకు చేరుకున్నప్పటికీ అదే పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. బుధవారము మధ్యాహ్నం విద్యార్థులు భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో తరగతిగది గోడ..

Srisailam: శ్రీశైలంలో కొబ్బరి చిప్పల కోసం వచ్చిన ఎలుగుబంటి.. వీడియో చూశారా..?

Srisailam: శ్రీశైలంలో కొబ్బరి చిప్పల కోసం వచ్చిన ఎలుగుబంటి.. వీడియో చూశారా..?

ఏపీలో వన్యప్రాణుల సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే తిరుమలతో చిరుత ఓ పాపను బలి తీసుకోగా.. దాన్ని బంధించారు. అయితే దాన్ని బంధించి.. 24 గంటలు కూడా గడవకుండానే.. తిరుమలలో మరో చిరుత సంచారం టెన్షన్ పుట్టిస్తుంది. ఇటు శ్రీశైలం ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరం వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. దాన్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సెల్‌పోన్లలో చిత్రీకరించారు. వారు గట్టిగా కేకలు వేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది.

Srisailam Temple: వరస సెలవులతో భక్తులతో పోటెత్తిన మల్లన్న క్షేత్రం.. దర్శనానికి 10 గం. సమయం..

Srisailam Temple: వరస సెలవులతో భక్తులతో పోటెత్తిన మల్లన్న క్షేత్రం.. దర్శనానికి 10 గం. సమయం..

వరుస సెలవులు కావడంతో శ్రీశైలం శివనామస్మరణతో మారు మ్రోగుతోంది. ఇసుకేస్తే రాలనంత భక్త జనం తరలివచ్చింది. వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

ఎంట్రన్స్ టెస్ట్ పాసైతేనే ఈ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్.. బెస్ట్ హై‌స్కూల్‌గా ఇప్పటికే గుర్తింపు.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే..?

ఎంట్రన్స్ టెస్ట్ పాసైతేనే ఈ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్.. బెస్ట్ హై‌స్కూల్‌గా ఇప్పటికే గుర్తింపు.. దాని ప్రత్యేకతలు ఏమిటంటే..?

Kurnool: కర్నూలుకు చెందిన ఆ ప్రభుత్వ ఉన్నత పాఠశాల రాష్ట్ర స్థాయిలోనే తన సత్తా చాటింది. అత్యుత్తమ ఉన్నత పాఠశాలగా రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలోనే ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. విశేషమేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బెస్ట్ హైస్కూల్‌గా రికార్డులకు ఎక్కడం ఆ స్కూల్‌కి ఇది రెండవసారి. ఇంకా గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ స్కూల్‌లో అడ్మిషన్ కావాలంటే తప్పనిసరిగా ఎంట్రన్ టెస్ట్ రాసి మెరిట్ సాధించాల్సిందే.. 

Srisailam Temple: మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజుల్లో రూ.3.44 కోట్ల ఆదాయం..

Srisailam Temple: మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజుల్లో రూ.3.44 కోట్ల ఆదాయం..

ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 3,43 ,68, 091 నగదు రాబడిగా లభించినట్లు ఆలయ ఈవో లవన్న చెప్పారు. ఈ ఆదాయం గత 28 రోజులలో మల్లన్న స్వామి బ్రమరాంబ అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో లభించినట్లు పేర్కొన్నారు. 

Andhra Pradesh: సినిమాను మించిన కేసు.. ఖాతాదారుల ప్రమేయం లేకుండా మాయమవుతున్న డబ్బులు..

Andhra Pradesh: సినిమాను మించిన కేసు.. ఖాతాదారుల ప్రమేయం లేకుండా మాయమవుతున్న డబ్బులు..

ఆత్మకూరు పట్టణంలోని SBI, యూనియన్ బ్యాంక్. కొత్తపల్లిలోని SBI బ్యాంక్ కు చెందిన పలు ఖాతాదారుల అకౌంట్‌లో ఈనెల 5 నుండి ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 70 మంది ఖాతాదారుల నుండి లక్షల రూపాయలలో డబ్బులు విత్ డ్రా కావడంతో బాధితులు బ్యాంకులు, పోలీస్ స్టేషన్ చుట్టూ పరుగులు తీస్తున్నారు. కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును బ్యాంకుల్లో తమకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం, ఆధార్ అప్డేట్, ఇతర అవసరాల కోసం వేసిన వేలిముద్రలను అక్రమంగా ఉపయోగించుకుని పేదలు, నిరక్షరాస్యులను..