Leopards In Nandyala: గ్రామ సమీపంలో చిరుతల సంచారం.. స్థానికులు గజగజ..! పట్టించుకోని అధికారయంత్రాంగం..
నంద్యాల జిల్లా, రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల క్రితం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో చిరుత పులి సంచరించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని అడవిలోకి తిరిగి పంపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరికొన్ని చిరుతపులులు అటవీ సమీప గ్రామాలైన పెద్ద కంబలూరు సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తూ రైతులను గడగడలాడి..
నంద్యాల, ఆగస్టు 21: రాష్ట్రానికి చెందిన నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు సమీపంలో రెండు చిరుతపులుల సంచారం చేస్తున్నాయి. దీంతో భయాందోళనలకు గురైన రైతులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సమాచారం అందించినా పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు. పైగా అటవీ ప్రాంతంలో చిరుతపులలో వస్తూపోతూ ఉంటాయని అడవి శాఖ అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు ఆవేదన ఇదీ..
నంద్యాల జిల్లా, రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత మూడు రోజుల క్రితం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో చిరుత పులి సంచరించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని అడవిలోకి తిరిగి పంపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరికొన్ని చిరుతపులులు అటవీ సమీప గ్రామాలైన పెద్ద కంబలూరు సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తూ రైతులను గడగడలాడిస్తున్నాయి. చిరుత పులుల సంచారం గురించి రైతులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు అటవీ సమీపంలో చిరుత పులులు వస్తూపోతూ ఉంటాయని అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని రోజుల క్రితం తిరుమల అడవుల్లో ఓ బాలికపై చిరుత దాడి చేసి చంపడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు చిరుతల సంచారం అంటేనే భయాందోళన చెందుతున్నారు. అటవీ సమీపాన వందల ఎకరాల్లో మినుము, మొక్కజొన్న ,వరి తదితర పంటలు రైతులు సాగు చేశారు. ప్రస్తుతము తెలుగు గంగ కాలువ ద్వారా నీరు ప్రవహిస్తూ ఉండడంతో రైతులు పంటలకు నీరు పెట్టుకునేందుకు వెళ్ళటానికి భయాందోళన చెందుతున్నారు. పంట పొలాల్లో సంచరిస్తున్న చిరుత పులులను అడవుల్లోకి వెళ్లేలా ఫారెస్ట్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. చిరుత పులులు సంచరిస్తున్నాయని సమాచారం అందించినప్పటికీ స్పందించని ఫారెస్ట్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.