AP News: ప్రభుత్వ పాఠశాలలో కూలిన గోడ.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం హుసేనాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గది గోడ కూలిపోయింది. విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం శిదిలావస్థకు చేరుకున్నప్పటికీ అదే పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. బుధవారము మధ్యాహ్నం విద్యార్థులు భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో తరగతిగది గోడ..
నంద్యాల, ఆగస్టు 17: అదొక ప్రభుత్వ పాఠశాల. గోడలు పాచిపట్టి రంగు వెలిసిపోయి పురాతన భవనం తలపించేలా ఉన్నాయి. వానకు నానిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ గోడల మధ్యలోనే ఎందరో పసిపిల్లలు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్ధులకు అక్కడే పాఠాలు చెబుతున్నారు. బుధవారం ఉన్నట్లుండి పాఠశాల భవనం గోడ కుప్పకూలిపోయింది. సరిగ్గా అదే సమయానికి విద్యార్ధులందరూ మధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్లారు. కూలిన గోడ తాలూకు రాళ్లు విద్యార్ధుల బ్యాగులపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గోడ కూలిన సమయంలో పిల్లలు ఉండి ఉంటే.. ఆ దృశ్యం తలచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టేలా ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ఆ పాఠశాలలో ఇప్పటి వరకూ పనులు ఎందుకు ప్రారంభించలేదంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం హుసేనాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం హుసేనాపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం మధ్యాహ్నం తరగతి గది గోడ కూలిపోయింది. విద్యార్థులు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం శిదిలావస్థకు చేరుకున్నప్పటికీ అదే పాఠశాలలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. బుధవారము మధ్యాహ్నం విద్యార్థులు భోజన విరామ సమయం కావడంతో విద్యార్థులు అందరూ బయటకు వెళ్లారు. ఆ సమయంలో పెద్ద శబ్దంతో తరగతిగది గోడ కూలింది. పెద్ద పెద్ద బండరాళ్లు విద్యార్థులు ఉంచిన బ్యాగులపై పడ్డాయి.
ఆ సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది పిల్లలున్నారు. బుధవారం తరగతి గదిలో సుమారు 28 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాద సమయంలో విద్యార్ధులందరూ భోజనానికి బయటికి వెళ్లడంతో ప్రాణ నష్టం జరిగింది. పాఠశాల భవనం మరమ్మత్తు చేసేందుకు నాడు నేడు కింద రూ.12.5 లక్షలు మంజూరయ్యాయి. అయినప్పటికీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ వరలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. పైఅధికారులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.