Andhra Pradesh: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. చివరికి

Nandyal News: నంద్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచోసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోమని అడగ్గానే ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపం చెందిన వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నంద్యాల టూ టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన కుమార్తె పేరు శ్రావణి. అయితే కూతురు శ్రావణి వైఎస్సార్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో బీహెచ్ఎమ్ఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది.

Andhra Pradesh: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. చివరికి
A Girl
Follow us

| Edited By: Vimal Kumar

Updated on: Jun 20, 2024 | 1:03 PM

నంద్యాల జిల్లా న్యూస్, ఆగస్టు 25 : నంద్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచోసుకుంది. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోమని అడగ్గానే ప్రియుడు ముఖం చాటేయడంతో మనస్థాపం చెందిన వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నంద్యాల టూ టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన కుమార్తె పేరు శ్రావణి. అయితే కూతురు శ్రావణి వైఎస్సార్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో బీహెచ్ఎమ్ఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో శ్రావణి సమీప బంధువు కర్నూలుకు చెందిన ధీరజ్ కుమార్ హౌస్ సర్జన్‎గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితం వివాహం చేసుకోవాలని శ్రావణి అడగడంతో దానికి ధీరజ్ నిరాకరించడాడు. అంతే కాకుండా చదువు పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని కల్లబొల్లి మాటలు చెప్పాడు.

దీంతో తీవ్ర మనస్థాపం,అందోళనకు గురైన శ్రావణి ప్రేమించి మోసపోయానని గ్రహించింది. ఈనెల 16వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇంటికి వచ్చిన గమనించిన కుటుంబ సభ్యులు శ్రావణిని చికిత్స నిమిత్తం పద్మావతినగర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శ్రావణి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్ కు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పోలీసులు నిందితుడు ధీరజ్ పై 420,306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ధీరజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ మధ్య యువతీ, యువకులు చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. యువతకు జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆత్మహత్యలే శరణం అనుకుంటున్నారని నిపుణలు చెబుతున్నారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాలని సూచనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననో, మార్కలు తక్కవ వచ్చాయనో, ప్రేమించినవారు మోసం చేశారనో మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం వెనక వారికి సరైన అవగాహన లేకపోవడం కారణమని చెబుతున్నారు. ఇలాంటి వాటిని నివారించేందుకు.. పిల్లలకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..