Srisailam Temple: వరస సెలవులతో భక్తులతో పోటెత్తిన మల్లన్న క్షేత్రం.. దర్శనానికి 10 గం. సమయం..

వరుస సెలవులు కావడంతో శ్రీశైలం శివనామస్మరణతో మారు మ్రోగుతోంది. ఇసుకేస్తే రాలనంత భక్త జనం తరలివచ్చింది. వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు.

Srisailam Temple: వరస సెలవులతో భక్తులతో పోటెత్తిన మల్లన్న క్షేత్రం.. దర్శనానికి 10 గం. సమయం..
Follow us

| Edited By: Surya Kala

Updated on: Aug 13, 2023 | 11:34 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మహిమగల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుస సెలవులు కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. వరుస సెలవులు కావడంతో శ్రీశైలం శివనామస్మరణతో మారు మ్రోగుతోంది. ఇసుకేస్తే రాలనంత భక్త జనం తరలివచ్చింది. దీంతో మల్లన్న స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది.

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. వరుస సెలవుల కారణంగా నేడు, రేపు కూడా క్షేత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..