Big News Big Debate: ఏపీలో ఇప్పుడు అందరి టార్గెట్‌ 2024.. సమాయత్తం అవుతున్న పార్టీలు.. లైవ్ వీడియో

Big News Big Debate: ఏపీలో ఇప్పుడు అందరి టార్గెట్‌ 2024.. సమాయత్తం అవుతున్న పార్టీలు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Apr 03, 2023 | 7:02 PM

ముందస్తు లేకపోయినా సమయం ఉంది కేవలం ఏడాది మాత్రమే కావడంతో పార్టీలన్నీ అలర్ట్‌ అయ్యాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాలపై ప్రచారం... ఎన్నికల వ్యూహాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.

ముందస్తు లేకపోయినా సమయం ఉంది కేవలం ఏడాది మాత్రమే కావడంతో పార్టీలన్నీ అలర్ట్‌ అయ్యాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాలపై ప్రచారం… ఎన్నికల వ్యూహాలపై ఫోకస్‌ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. గతానికి భిన్నంగా వార్నింగులు కాకుండా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సోషల్‌ మీడియా నుంచి పథకాల వరకూ అన్ని అస్త్రాలను పట్టుకుని నెలకు 20 రోజులు జనాల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు ఉపదేశించారు సీఎం జగన్. ఎమ్మెల్యే అయినా… కార్యకర్త అయినా నాకు అత్యంత కీలకం.. మీతో ఉన్నది రాజకీయ బంధం కాదు.. మానవ సంబంధం అంటూనే గ్రాఫ్‌ పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వాపు మాత్రమే… ప్రత్యర్ధులు బలుపు అనుకుంటున్నారని దీనిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు సీఎం జగన్‌.

Published on: Apr 03, 2023 07:02 PM