Telangana: వరంగల్‌లో టెన్షన్ టెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర బీజేపీ ఆందోళన..
Warangal News: వరంగల్‌లో టెన్షన్ నెలకొంది. హనుమకొండలో బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణలో బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
Warangal News: వరంగల్‌లో టెన్షన్ నెలకొంది. హనుమకొండలో బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణలో బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ నేత రాకేశ్ రెడ్డిని అతికష్టం మీద అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ బీజేపీ ఇవాళ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు ఆఫీస్ దగ్గర భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారి మొత్తం ముళ్ల కంచెలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం ముందు ప్లాన్ ప్రకారం ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ముళ్లకంచెలు గుచ్చుకొని కొందరికి గాయాలయ్యాయి.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు ఆఫీస్ దగ్గర పోలీసులను భారీగా మోహరించినప్పటికీ.. బీజేపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల ముట్టడి నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైతం భారీగా చేరుకున్నారు. దీంతో వరంగల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నర్సంపేటలో..
నర్సంపేటలో సైతం బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా బీజేపీ నేతలు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి