Trains Canceled: పెద్ద సంఖ్యలో దక్షిణ మధ్య పరిధిలో 75 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు.
దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్‌పుర్-ధన్‌మండల్ సెక్షన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, హరిదాస్‌పుర్-ధన్‌మండల్ సెక్షన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను ప్రకటించింది. ఆయా రైళ్లను నేటి నుంచి 29 వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరో వైపు భువనేశ్వర్ – ముంబయి, హౌరా – సికింద్రాబాద్, భువనేశ్వర్ – సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులను ఈ నెల 24 నుంచి 30 వరకు పలు తేదీల్లో భువనేశ్వర్‌కు బదులుగా ఖుర్దా రోడ్ నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ వివరించింది. అలాగే విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రద్దుతో వేల కొద్దీ ప్రయాణికుల మీద ప్రభావం పడబోతోంది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్దితి ఉంది. అయితే పండగలు, సెలవుల సీజన్ కాకపోవడంతో రద్దీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా రోజువారీ ప్రయాణాలు చేసే వారిపై ఈ రైళ్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...