TOP 9 ET: పవన్‌ vs RGV  | చిరంజీవి + RGV.. ట్రెండ్ అవుతున్న ఆర్జీవీ కామెంట్స్..

TOP 9 ET: పవన్‌ vs RGV | చిరంజీవి + RGV.. ట్రెండ్ అవుతున్న ఆర్జీవీ కామెంట్స్..

Anil kumar poka

|

Updated on: Aug 18, 2023 | 8:31 AM

కింగ్ నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా మన్మథుడు రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆగస్ట్ 29 నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అన్నపూర్ణ స్టూడియోస్ వారు. ఇక 2002 డిసెంబర్‌లో విడుదలైన మన్మథుడు సినిమాను విజయ భాస్కర్ తెరకెక్కించారు. నాగ్ కెరీర్లో నే వన్‌ ఆఫ్ ది బిగ్ హిట్ అయిన ఈ సినిమాలో.. అన్షు, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు.

01.Pawan
ఏపీ రాజకీయాలను మరో సారి కథా వస్తువుగా తీసుకుని వ్యూహం అనే సినిమా తెరకెక్కించిన వర్మ.. తాజాగా టీవ9 బిగ్ డిబెట్లో షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను ఇంప్రెస్ చేసిన నాయకులను.. తనకు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేసిన నాయకులను వారి రాజకీయ పరిస్థితులను, వ్యూహాలను .. వ్యూహం సినిమాలో చూపించా అన్నారు. ఇక ఈ క్రమంలోనే పవన్‌ గురించి ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ కామెంట్స్ చేశారు. పవన్‌ రాజకీయాల గురించి.. ఆయన స్టేట్మెంట్ల గురించి , ఆయన సిద్దాంతాల గురించి తీసుకునే నిర్ణయాల గురించి.. వాటికి కట్టుబడలేని తన వైఖరి గురించి.. పవన్‌ హార్డ్ కోర్ అభిమానుల గురించి.. వ్యూహం టీజర్లో పవన్‌ మీదున్న చివరి డైలాగ్‌ గురించి..! ఇలా ప్రతీ దాని గురించి పాయింట్‌ వైజ్‌గా.. టీవీ9 బిగ్ డిబెట్లో క్లియర్ గా చెప్పారు వర్మ. !

02.RGV CHirnajeevi
పార్లమెంట్లో.. రాజకీయనేతల నోళ్లలో రెమ్యూనరేషన్ మాటేంటని… విమర్శించిన చిరు కామెంట్స్పై వర్మ్ రియాక్టయ్యారు. సినిమాటోగ్రఫీ చట్ట సవవరణ జరగాలని.. పార్లమెంట్లో మాట్లాడిన విజయ సాయిరెడ్డి మాటలు తనకు తెలియవని.. చిరు కామెంట్స్ను కూడా తాను పూర్తిగా ఫాలో అవలేదని అంటూనే.. రెమ్యూనరేషన్‌ పై చిరు స్టాండ్ను.. చెప్పిన మాటలను సపోర్ట్ చేశారు వర్మ. అంతేకాదు సినిమాకు కూడా.. డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపులే వర్తిస్తుందని ఓ షర్ట్ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లేన్ చేసిన వర్మ… డిమాండ్కు మించి హీరోలు ఎక్కువగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారనేది పెద్ద బూతంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.

03.Kalki
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి 2989 ఏడీ మూవీ టీమ్‌తో మరో స్టార్ హీరో జాయిన్ అయ్యారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకోన్‌, దిశా పాట్నీ లాంటి టాప్ స్టార్స్‌ నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దుల్కర్ చేస్తుంది చిన్న రోల్‌ అయినా… కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతున్నారట.

04.Manmadhudu
కింగ్ నాగార్జున ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా మన్మథుడు రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఆగస్ట్ 29 నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అన్నపూర్ణ స్టూడియోస్ వారు. ఇక 2002 డిసెంబర్‌లో విడుదలైన మన్మథుడు సినిమాను విజయ భాస్కర్ తెరకెక్కించారు. నాగ్ కెరీర్లో నే వన్‌ ఆఫ్ ది బిగ్ హిట్ అయిన ఈ సినిమాలో.. అన్షు, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు.

05.Dhoni
కోలీవుడ్ సర్కిల్స్‌లో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని ఓ తమిళ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ధోని నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ తమిళనాట హల్‌ చల్ చేస్తోంది.

06.Rajinikanth
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు గోల్డెన్ ఛాన్స్‌ దక్కింది. జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్‌, నెక్ట్స్ మూవీ జై భీమ్‌ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో రజనీతో పాటు శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

07.Varun Tej
ప్రజెంట్ గాండీవధారి అర్జున్‌, ఆపరేషన్‌ వాలెంటైన్ సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్‌, నెక్ట్స్ మట్కా పేరుతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం 1960 నాటి వైజాగ్‌ను తలపించేలా భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు.

08.Dalapathi
జైలర్ సక్సెస్ తరువాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పాత సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే శివాజీ సినిమాను డిసెంబర్ 9న రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్‌ చేశారు మేకర్స్. తాజాగా ఈ లిస్ట్‌లోకి కల్ట్ క్లాసిక్ దళపతి కూడా యాడ్ అయ్యింది. దళపతి సినిమాను రీ మాస్టర్‌ చేసి 4 కే క్వాలిటీలో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

09.Gadar 2
బాక్సాఫీస్ దగ్గర గదర్ 2 జోరు కంటిన్యూ అవుతోంది. అక్షయ్‌ కుమార్ లాంటి స్టార్ హీరోతో పోటి పడి కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నారు సీనియర్ హీరో సన్నీ డియోల్‌. 23 ఏళ్ల తరువాత వచ్చిన సీక్వెల్‌కు ఆడియన్స్‌ బ్రహ్మారథం పడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...