Anil kumar poka

Anil kumar poka

Digital Graphic Designer - TV9 Telugu

anilkumar.poka@tv9.com

గ్రాఫిక్ డిజైనర్‌గా ఐదేళ్ల అనుభవం ఉంది. అలాగే పలు యాడ్ ఏజెన్సీలలో కూడా పని చేసిన అనుభవం ఉంది. 2019 ఫిబ్రవరి నుంచి టీవీ9లో డిజిటల్ గ్రాఫిక్ డిజైనర్‌గా కొనసాగుతున్నాను.

Trains Canceled: పెద్ద సంఖ్యలో దక్షిణ మధ్య పరిధిలో 75 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు.

Trains Canceled: పెద్ద సంఖ్యలో దక్షిణ మధ్య పరిధిలో 75 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలు.

దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్‌, మంచేశ్వర్‌, హరిదాస్‌పుర్‌-ధన్‌మండల్‌ సెక్షన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను ప్రకటించింది.

Indigo Flight: విమానంలో రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. వీడియో.

Indigo Flight: విమానంలో రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. వీడియో.

ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని మరణించారు. ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో ఆగస్టు 21 సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, ట్యూబరిక్యులోసిస్‌తో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. విషయం పైలట్‌కు తెలియజేయడంతో పైలట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు.

Onion prices: సామాన్యుడ్ని భయపెడుతున్న ఉల్లి..! పెరిగిన ధరలతో ఉల్లి కన్నీరు.

Onion prices: సామాన్యుడ్ని భయపెడుతున్న ఉల్లి..! పెరిగిన ధరలతో ఉల్లి కన్నీరు.

నిత్యావసర వస్తువుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు బాగా పెరుగుతున్నాయి. సామాన్యులు వాటిని కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఒకప్పుడు వంద రూపాయలు తీసుకెళ్తే.. నాలుగైదు కూరగాయలు వచ్చేవి.. కానీ ఇప్పుడు 500 రూపాయిలు తీసుకెళ్లినా సంచి నిండటం లేదు. టమాటా ధర తగ్గిందని ఊపిరి పీల్చుకునేలోపే..

Viral Video: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే రంగంలోకి పోలీసులు.

Viral Video: తేనె కోసం వెళితే బంగారు నాణేల బిందె దొరికింది.. కట్ చేస్తే రంగంలోకి పోలీసులు.

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టెపల్లికి చెందిన వరుణ్, అజిత్, వెంకటేశ్వర్లు అనే నలుగురు యువకులు తేనె కోసం గ్రామ సమీపంలోని కొండ పై ఉన్న పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి ఎంతో విలువైన బంగారు నాణేలుతో కూడిన చెంబు దొరికింది. అక్కడ రాళ్ల కింద వారికి ఇత్తడి చెంబు కనిపించింది. అయితే రాళ్లను తొలగించి చెంబు ను బయటకు తీసిన యువకులు దాన్ని పగులకొట్టి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి.

Viral Video: ఈ కోతి ఒలింపిక్స్‌కి వెళ్తే గోల్డ్‌ మెడల్‌ ఖాయం.. బాస్కెట్‌బాల్‌తో రెచ్చిపోయిన కోతి.

Viral Video: ఈ కోతి ఒలింపిక్స్‌కి వెళ్తే గోల్డ్‌ మెడల్‌ ఖాయం.. బాస్కెట్‌బాల్‌తో రెచ్చిపోయిన కోతి.

అల్లరి చేష్టలకు కేరాఫ్‌ కోతి... అని మనం అనుకుంటాం. కానీ మాలోనూ ట్యాలెంటెడ్‌ మంకీలు ఉన్నాయంటోంది ఓ కోతి. అనడమేంటి.. నిరూపిస్తోంది కూడా.. ఎలా అంటారా? రోడ్డుపక్కన బాస్కెట్‌ బాల్‌ ఆడుతూ మైకేల్‌ జోర్డాన్‌లా రెచ్చిపోయింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కోతి ఒలింపిక్స్‌కి వెళ్తే మెడల్‌ ఖాయం అంటున్నారు.

Elephants: మన్యం జిల్లాలో గుంపు నుండి తప్పిపోయిన ఏనుగు.. తోటి ఏనుగుల కోసం వెతుకులాట.

Elephants: మన్యం జిల్లాలో గుంపు నుండి తప్పిపోయిన ఏనుగు.. తోటి ఏనుగుల కోసం వెతుకులాట.

మన్యంజిల్లా పంటపొలాల్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కొమరాడ మంటంల నిమ్మలపాడులో ఏనుగుల గుంపు చొరబడింది. పంటపొలాల్లో తిరుగుతూ రైతులను తీవ్ర భయాందోళనకు గరిచేశాయి. స్థానికులు వాటిని బెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఈ ఏనుగుల గుంపునుంచి ఓ ఏనుగు తప్పిపోయింది. దాంతో మిగతా ఏనుగుల జాడ తెలియక వాటికి సంకేతం ఇస్తూ పెద్ద పెద్దగా ఘీంకారాలు చేస్తూ రచ్చ రచ్చ చేసింది.

Srikakulam: గ్రామంలో ఎలుగుబంట్లు స్వైర విహారం.. భయాందోళనలో ప్రజలు..!

Srikakulam: గ్రామంలో ఎలుగుబంట్లు స్వైర విహారం.. భయాందోళనలో ప్రజలు..!

ఇటీవల చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైపోయింది. అడవులను వదిలి ఆహారం కోసం గ్రామాల్లో చొరబడుతున్నాయి. తిరుపతి, శ్రీశైలంలో భక్తులపై దాడులకు తెగబడుతూ భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో ఎలుగుబంట్లు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మందస మండలం మల్లెనవారి పేట గ్రామంలోకి..

Viral: ఓరీ మీ భక్తి బంగారం కానూ.. పామును ఇంటికి తీసుకొచ్చి పూజలా.. వీడియో వైరల్.

Viral: ఓరీ మీ భక్తి బంగారం కానూ.. పామును ఇంటికి తీసుకొచ్చి పూజలా.. వీడియో వైరల్.

నిజశ్రావణమాసం ప్రారంభంతోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు. పుట్ట దగ్గర పూజలు.. ఆ పుట్ట దగ్గర ఒకవేళ పాము ప్రత్యక్షంగా కనిపిస్తే నేరుగా దానికే పూజలు చేయడం మనం చూసి ఉంటాం.

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.! 16 ఏళ్ల బాలికపై 8 మంది గంజాయి బ్యాచ్‌ అత్యాచారం..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.! 16 ఏళ్ల బాలికపై 8 మంది గంజాయి బ్యాచ్‌ అత్యాచారం..

హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఈ క్రమంలో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై పైశాచికంగా ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎనిమిదిమంది గంజాయు ముఠా బాలిక ఇంట్లో చొరబడి, కత్తులతో బాలికను బెదిరించి దారుణానికి పాల్పడ్డారు. మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ లాల్ బజార్ కు చెందిన బాలిక తల్లిదండ్రులు..

Girlfriend – Boyfriend:  ప్రియుడుని మరువలేక.. తరలిరాని లోకాలకు ప్రియురాలు.. వీడియో.

Girlfriend – Boyfriend: ప్రియుడుని మరువలేక.. తరలిరాని లోకాలకు ప్రియురాలు.. వీడియో.

ఇంకా ప్రేమ పేరుతో చక్కని భవిష్యత్తును యువత నాశనం చేసుకుంటున్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకుంటే ప్రియుడ్ని మర్చిపోలేక ప్రియురాలు కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా యానాంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక అనే యువతికి ఓ అక్క, చెల్లి ఉన్నారు.

Viral: కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి.. ఎందుకో తెలిస్తే షాక్‌..!

Viral: కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి.. ఎందుకో తెలిస్తే షాక్‌..!

కొంతమంది ఆస్తులు లేకున్నా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఎన్ని ఆస్తులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలో ధనవంతులైన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య కోట్ల సంపదను.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ వజ్రాల వ్యాపారి కుమార్తె ఇప్పటికే తన తొమ్మిదవ ఏటనే సన్యాస దీక్షను తీసుకుంది. ఇప్పుడు ఆమె తల్లి తండ్రులు కూడా సన్యాసులుగా మారారు.

Gayathri Gupta: 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకనని చెప్పారు.. చనిపోవడమే నయమనిపించింది.

Gayathri Gupta: 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకనని చెప్పారు.. చనిపోవడమే నయమనిపించింది.

నటి గాయత్రి గుప్తా యాంకర్‌గా కొంతకాలం తర్వాత షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ ఫేమస్‌ అయింది. ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్‌ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.