Jailer Movie Review: హిట్టా..? ఫట్టా..? రజిని జైలర్ సునామి ఎలా ఉందంటే..?
రజినీ.. ! జెస్ట్ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పిన.. తన స్టైల్ ఆఫ్ మాస్ డైలాగ్‌తో.. సోషల్ మీడియాను ఆగమాగం చేసిన ఈ స్టార్.. మరి తన ఫుల్ జైలర్ ఫిల్మ్ తో హంగామా చేయరంటారా? అందర్నీ ఆకట్టుకోరంటారా? నెల్సన్ డైరెక్షన్లో.. అనిరుద్ మ్యూజిక్ కంపోజింగ్లో.. మోస్ట్ అవెటెడ్ మూవీగా సిల్వర్ స్క్రీన్స్ హిట్ చేసిన ఈ మూవీ అసలు ఎలా ఉంటంటారు? ఈ ప్రశ్నలకే.. ఆన్సర్ కావలంటే.. జెస్ట్ వాచ్ దిస్ ఫుల్ రివ్యూ వీడియో ఆఫ్ జైలర్.
రజినీ.. ! జెస్ట్ జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పిన.. తన స్టైల్ ఆఫ్ మాస్ డైలాగ్‌తో.. సోషల్ మీడియాను ఆగమాగం చేసిన ఈ స్టార్.. మరి తన ఫుల్ జైలర్ ఫిల్మ్ తో హంగామా చేయరంటారా? అందర్నీ ఆకట్టుకోరంటారా? నెల్సన్ డైరెక్షన్లో.. అనిరుద్ మ్యూజిక్ కంపోజింగ్లో.. మోస్ట్ అవెటెడ్ మూవీగా సిల్వర్ స్క్రీన్స్ హిట్ చేసిన ఈ మూవీ అసలు ఎలా ఉంటంటారు? ఈ ప్రశ్నలకే.. ఆన్సర్ కావలంటే.. జెస్ట్ వాచ్ దిస్ ఫుల్ రివ్యూ వీడియో ఆఫ్ జైలర్.టైగర్ ముత్తువేల్ పాండియన్ అలియాస్ రజినీ కాంత్.. ఓ స్ట్రిక్ట్ జైలర్. తన డ్యూటీని నిక్కచ్చిగా నిర్వర్తించే జైలర్. ఇక మరో వైపు ఓ మంచి ఫ్యామిలీ మ్యాన్. తన తన భార్యను.. పిల్లలను బాధ్యతగా చూసుకుకే ఫ్యామిలీ మ్యాన్. ఇలాంటి పాండియన్ తన డ్యూటీని నిర్వహిస్తున్న క్రమంలో.. జైలులో ఓ గ్యాంగ్ స్టర్ తప్పించుకునే ప్రయత్నాన్ని తెలుసుకుంటాడు. ఆ ప్రయత్నాన్ని హీరోయిక్‌గా అడ్డకుంటాడు. కానీ ఆ క్రమంలోనే తన కొడుకును కోల్పోతాడు. మరి ఆ తరువాత పాండియన్ ఏం చేస్తాడు. కొడుకు చావుకు కారణమైన గ్యాంగ్ స్టర్ ముఠాను మట్టుపెడతాడా..? కుంటుంబ బాధ్యతకు తలొగ్గి మిన్నకుంటాడా? లేక తనలోని మరో కోణాన్ని చూపిస్తాడా? మధ్యలో తన కొడుకు రియల్ ట్రూత్ ఏంటి? అనేది సినిమా కంటిన్యూ కథ.
ఇక ఈ సినిమా.. రజనీ కుంటుంబ నేపథ్యంతో మొదలై.. ప్లజెంట్‌గా టేకాఫ్ అవుతుంది. ఆ క్రమంలోనే.. యోగి బాబు రజినీ కలయికలో వచ్చే సీన్లు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. దానికితోడు ప్రతీ చిన్న విషయాన్ని భయపడే వ్యక్తిగా రజినీ యాక్టింగ్ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూనే వింటేజ్ రజినీని గుర్తుకు తెస్తుంది. ఆ తరువాత వచ్చే ఇంటర్వ్యెల్ సీన్ ఒక్కసారిగా ఆడియెన్స్‌ను హై అయ్యేలా చేస్తుంది. సెకండ్ ఆఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక సెకండ్ ఆఫ్ మాత్రం కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఫీలింగ్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో ఎగిరిపోతుంది. దాన్ని కంటిన్యూ చేస్తూ… క్లైమాక్స్‌లో వచ్చే మరో ట్విస్ట్ ఒక్కసారిగా సినిమా చూస్తున్న అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తుంది.
ఇక ఈ సినిమాలో రజినీ ఎప్పటిలానే అదరగొట్టారు. తన స్టైల్‌తోనూ.. మేనరిజంతోనూ.. థియేటర్లో అందర్నీ అరిపిస్తారు. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోనూ.. ప్రజెంట్ సిట్యూవేషన్ లోనూ.. రెండు షేడ్స్‌లో స్టైలిష్గా కనిపించి అందర్నీ ఫిదా చేస్తారు. గెస్ట్ రోల్స్ చేసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్… బాలీవుడ్ స్టార్ జాకీ షాఫ్ర్ ఉన్నంత సేపు అదరగొట్టారు. జైలర్ సినిమాలో ఓ కీ రోల్ చేసిన సునిల్, రజినీ వైఫ్‌గా చేసిన రమ్యకృష్ణ , కూతురిగా చేసిన మిర్నా మీనన్, రజినీ కొడుకుగా చేసిన వసంత్ రవి, కమెడియన్ యొగిబాబు.. నాగబాబు పరిధి మేర నటించారు. ఇక తమన్నా ఐటెం సాంగ్ థియేటర్లో ఓ రేంజ్‌లో పేలుతుంది.
ఇక జైలర్ సినిమాకు.. మరో ప్లస్ పాయింట్ అనిరుద్ మ్యూజిక్. రిలీజ్‌కు ముందే ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చిన పాటలకు తోడు.. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను కూడా దిమ్మతిరిగే రేంజ్ ఇచ్చారు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్ బాయ్ కావడంతోనో లేక నెల్సన్ బెస్ట్ ఫ్రెండ్ వల్లో .. ఏమో కానీ.. రజీన ఎలివేషన్ సీన్లతో.. తన మ్యూజిక్ తో విరుచుకుపడ్డాడు అనిరుద్. ప్రతీ సీన్‌ను… మరో లెవల్లో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఇవన్నీ పక్కకు పెడితే.. ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా టాప్ నాచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ , కెమెరా వర్క్ కూడా ఇంప్రెసివ్ ఉన్నాయి. నెల్సన్ డైరెక్షన్ యాజ్ యూజ్‌వల్ సాల్ట్ అండ్ పెప్పర్లానే ఉంది. ఇక ఓవర్ ఆల్‌గా జైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. సూపర్ స్టార్’s సినిమా..! పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ విత్ గుడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...