BRO in OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎక్కడ ఎప్పటి నుంచంటే..?

BRO in OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్‌ ఎక్కడ ఎప్పటి నుంచంటే..?

Anil kumar poka

|

Updated on: Aug 21, 2023 | 9:23 AM

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తన మేనల్లుడితో కలిసి నటించిన సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా స్ర్టీమింగ్‌ కోసం మెగాఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 25 నుంచి బ్రో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తన మేనల్లుడితో కలిసి నటించిన సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా స్ర్టీమింగ్‌ కోసం మెగాఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 25 నుంచి బ్రో సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లను సాధించింది. బ్రో ఓటీటీ రిలీజ్ కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రో.. ది అవతార్ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ తాజాగా అప్ డేట్ ప్రకటించింది. తొలుత ఈ సినిమాను పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, వారం రోజుల ముందే స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ తాజాగా ట్వీట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...