IPL 2023: కెప్టెన్‌గా మార్క్‌రమ్.. హార్డ్ హిట్టర్లుగా బ్రూక్, సుందర్, క్లాసెన్.. సన్‌రైజర్స్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది..
మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2న(ఆదివారం) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌కు ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. అలాగే ఇటీవల జరిగిన మినీ వేలంలో పలువురు విధ్వంసకర ప్లేయర్స్‌ను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ యాజమాన్యం. మరి ఆ జట్టుకు సంబంధించిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఏంటో చూసేద్దామా..?
1. అభిషేక్ శర్మ 2. మయాంక్ అగర్వాల్ 3. రాహుల్ త్రిపాఠి 4. ఐడెన్ మార్క్‌రమ్(కెప్టెన్) 5. హ్యారీ బ్రూక్ 6. వాషింగ్టన్ సుందర్ 7. హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్) 8. అడిల్ రషీద్ 9. ఉమ్రాన్ మాలిక్ 10. భువనేశ్వర్ కుమార్ 11. టి. నటరాజన్
-
ఫుల్ స్క్వాడ్:
మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హొస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ వ్యాస్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీ.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..