SA Vs WI: రికార్డుల ఊచకోత.. 35 సిక్సర్లు, 46 ఫోర్లతో 517 పరుగులు.. రెండు భారీ శతకాలు..
అట్టాంటి.. ఇట్టాంటి రికార్డులు కావు సామీ.. ఏకంగా రికార్డుల ఊచకోత జరిగింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు.. బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
అట్టాంటి.. ఇట్టాంటి రికార్డులు కావు సామీ.. ఏకంగా రికార్డుల ఊచకోత జరిగింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు.. బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అది కూడా వన్డే మ్యాచ్ కాదు.. టీ20 మ్యాచ్‌లో ఈ రికార్డులు చోటు చేసుకున్నాయి. మరి ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా..
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్ చేధించిన జట్టుగా రికార్డుల్లో తన పేరును లిఖించింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో సఫారీల జట్టు 259 పరుగులను కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. అంతకుముందు 2018లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 245 పరుగులు చేజ్ చేయగా.. ఇప్పటివరకు టీ20ల్లో ఆ రికార్డు కొనసాగుతోంది. ఇక తాజా మ్యాచ్‌లో ప్రోటీస్ జట్టు ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.
259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సఫారీల జట్టులో క్వింటన్ డికాక్ తుఫాన్ సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ మార్క్రమ్ 38 పరుగులతో ఆజేయంగా నిలవడంతో దక్షిణాఫ్రికాకు అద్భుత విజయం దక్కింది.
అటు వెస్టిండీస్ తరపున జాన్సన్(118) అద్బుతమైన సెంచరీ సాధించాడు. గేల్ రికార్డును బద్దలు కొట్టి.. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 35 సిక్సర్లు, 46 ఫోర్లతో 517 పరుగులు నమోదయ్యాయి. టీ20ల్లో ఇదే అత్యధిక స్కోర్.. అంతకముందు క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 515 పరుగులు నమోదైన విషయం విదితమే.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..