Vande Bharat Express: ఆ రెండు నగరాల మధ్య వందేభారత్ రైలు.. కేవలం గంటన్నర ప్రయాణం.!
జైపూర్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బుధవారం రైల్వేశాఖ ఈ రెండు నగరాల మధ్య రైలు రూట్ మ్యాప్‌ను..
జైపూర్-ఢిల్లీ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. బుధవారం రైల్వేశాఖ ఈ రెండు నగరాల మధ్య రైలు రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఢిల్లీ, జైపూర్ మధ్య నడవనున్న వందేభారత్ రైలు మూడు స్టేషన్లలో ఆగుతుంది. గుర్గావ్, రేవారీ, అల్వార్ ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి వారంలో ఈ ట్రైన్ వేగం గంటకు 72 కిలోమీటర్లు ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే రైలు వేగాన్ని గంటకు 150 కిలోమీటర్లకు పెంతుతారు. ఇక ఢిల్లీ-జైపూర్ వందేభారత్ రైలు ట్రయల్ రన్ మార్చి 25 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ రైలు ఢిల్లీ నుంచి సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరి 6.45 గంటలకు గుర్గావ్ స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే రేవారి జంక్షన్ వద్ద 7.35 గంటలకు వస్తుంది. ఆ తర్వాత రైలు రాత్రి 8.25 గంటలకు అల్వార్‌కు.. రాత్రి 10.20 గంటలకు జైపూర్‌కు చేరుతుంది. అటు ఈ రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు అజ్మీర్ చేరుకుంటుంది. అంటే 442 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు ఆరు గంటల ఐదు నిమిషాల్లో చేరుకుంటుంది.
ఇక వందేభారత్ రైలు వేగం గంటకు 150 కి.మీకి పెరిగినప్పుడు కేవలం 1 గంట 45 నిమిషాల్లోనే జైపూర్ నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. అలాగే జైపూర్ నుంచి అల్వార్‌కు ఈ రైలు కేవలం ఆరు గంటల్లో చేరుతుంది. బుధవారం మినహా అన్ని రోజులలో ఈ వందేభారత్ రైలు నడుస్తుంది.
మరోవైపు ఈ కొత్త రైలుకు సంబంధించిన ఫుడ్ మెనూని కూడా రైల్వే సిద్ధం చేసింది. ఇందులో ఆనియన్ కచోరీ, జోధ్‌పూర్ పులావ్, దాల్-బాటీ మొదలైనవి ఉంటాయి. వందేభారత్ రైళ్లలో 16 ప్యాసింజర్ కార్లు ఉంటాయి, వీటిలో 1,196 మంది ప్రయాణికులు కూర్చోగలరు. ఒక్కో కోచ్‌లో 78 సీట్లు ఉంటాయి. ఈ రైలు టికెట్ ధర రూ.800 ఉంటుందని అంచనా. అలాగే ఎగ్జిక్యూటివ్ కారు టిక్కెట్ ధర రూ.1800 ఉంటుందని సమాచారం. అయితే టికెట్ ఛార్జీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.