Saqlain Mushtaq: ‘వాళ్లిద్దరూ చిరుత పులులు, ఔట్ చేయడం కష్టం’.. టీమిండియా దిగ్గజాలపై పాక్ మాజీ ప్రశంసల వర్షం..

పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాన్ మన దిగ్గజాల ఆటతీరును కీర్తించాడు. నమ్మశక్యం కాకపోయినా నమ్మాల్సిందే. ఒకప్పుడ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే.. ఇరుదేశాలలోని సాధారణ  ప్రేక్షకులు కూడా ఆ రోజు పనులన్నీ ఆపేసి మరీ..

Saqlain Mushtaq: ‘వాళ్లిద్దరూ చిరుత పులులు, ఔట్ చేయడం కష్టం’.. టీమిండియా దిగ్గజాలపై పాక్ మాజీ ప్రశంసల వర్షం..
Saqlain Mushtaq On Team India Legends
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 27, 2023 | 12:07 PM

టీమిండియా మాజీ ప్లేయర్ల మీద పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అవును నిజమే. సాధారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అది ప్రపంచ యుద్దం వంటిదే. కానీ పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాన్ మన దిగ్గజాల ఆటతీరును కీర్తించాడు. నమ్మశక్యం కాకపోయినా నమ్మాల్సిందే. ఒకప్పుడ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటే.. ఇరుదేశాలలోని సాధారణ  ప్రేక్షకులు కూడా ఆ రోజు పనులన్నీ ఆపేసి మరీ ఆట చూస్తారు. అయితే ఈ దాయాది దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండో-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. అడపాదడపా ఐసీసీ టోర్నీల పేరుతో కలిసి మైదానంలో దిగుతున్నాయి ఈ రెండు జట్లు. కానీ ఈ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగి చాలా ఏళ్లు గడిచిపోయింది.  అయితే ఇరుదేశాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో దశాబ్ద కాలంగా ఇండియా- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల కారణంగా వన్డే, టీ20ల్లో ఇండో పాక్ ఫైట్ చూసే అవకాశం దొరుకుతున్నా, టెస్టు మ్యాచులు జరగక చాలా ఏళ్లు అవుతోంది. ఈ తరుణంలో సక్లైన్ ముస్తాన్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్తాన్‌ ప్రధానంగా ఫాస్ట్ బౌలర్లకు ప్రసిద్ధి. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్‌, షోయబ్ అక్తర్, మహ్మద్ అసిఫ్ వంటి అనేక మంది ఫాస్ట్ బౌలర్లు.. ప్రపంచ స్థాయి బ్యాటర్లను కూడా బాగా ఇబ్బంది పెట్టారు. ఇదే తరహాలో పాక్ నుంచి కొందరు స్పిన్నర్లు కూడా టాప్ క్లాస్ పర్పామెన్స్ ఇచ్చారు. అయితే పాక్ స్పిన్ బౌలింగ్ యూనిట్‌పై చాలాసార్లు పైచేయి సాధించారు భారత బ్యాట్స్‌మెన్. ఈ నేపథ్యంలో మాట్లాడిన పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్.. భారత బ్యాటర్లకు బౌలింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డానని తెలిపాడు. ముస్తాక్ మాట్లాడుతూ..‘సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్.. ఇద్దరూ ఇద్దరే.. టెస్టుల్లో ఈ ఇద్దరికీ చాలా సార్లు అవుట్ చేశాను. అయితే ఓ ఎలుకను పట్టుకోవడానికి, ఓ పులిని పట్టుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఎలుక, బోనులో ఎర వేస్తే దొరికిపోతుంది. కానీ చిరుత పులి అలా కాదు.. ఈ బ్యాటర్లను ఎలుకలా పట్టుకోలేం, ఎలుకలు అసలు పట్టుకోలేవు’ అని అన్నాడు.

ఇంకా ‘సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లను అవుట్ చేయడానికి గంటల కొద్దీ శ్రమించాల్సి వచ్చేది. కొన్నిసార్లు 20 ఓవర్లు కూడా వేస్తాను, మరికొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఓవర్లే బౌలింగ్ చేశాను. వారికి ఆటను అర్థం చేసుకోవడం, చదవడం బాగా తెలుసు. అందుకే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కూడా వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అయ్యారు. ఎంతో ఓపిగ్గా ఉంటూ రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తే కానీ వారి వికెట్ దక్కేది కాదు. కొన్నిసార్లు మొదటి ఓవర్లలోనే వికెట్ దక్కినా అది అదృష్టం వల్ల వచ్చిన వికెట్ అవుతుందే కానీ మా ప్రతిభ కాదు. నేను బౌలింగ్‌కి వస్తున్నానని తెలిస్తే అజయ్ జడేజా ముఖం వాడిపోయేది. కానీ సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ చాలా డేంజరస్ బ్యాటర్లు. వాళ్లను అవుట్ చేయడం చాలా కష్టమైన విషయం’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్. ఇక పాకిస్తాన్ తరుపున 49 టెస్టులు, 169 వన్డేలు ఆడిన సక్లైన్ ముస్తాన్..496 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. అలాగే 19 సార్లు ఐదేసి వికెట్ల ప్రదర్శనను కూడా నమోదు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..