Varalakshmi Vratam: తెలుగువారి లోగిల్లో శ్రావణ శోభ.. కోనసీమలో ఆకట్టుకుంటున్న అష్టలక్ష్మి అమ్మవార్ల మండపం..

వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలకు ఎంతో ఉత్సాహం వస్తుంది. సాంప్రదాయ దుస్తులతో సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందా అనే విధంగా అలంకరించుకుంటారు. ప్రతి ఇంటా ఎంతో సందడి నెలకొంటుంది. శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు

Follow us
Pvv Satyanarayana

| Edited By: Vimal Kumar

Updated on: Mar 01, 2024 | 2:41 PM

శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాల మాసం. ముఖ్యంగా శ్రావణ మాసంలో మహిళలు వరలక్ష్మీ పూజకు , మంగళ గౌరీ పూజకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. లక్ష్మీదేవి అంశంగా భావించే వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలోని పౌర్ణమి కి ముందు వచ్చే శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తిశ్రద్దలతో కొలిచే భక్తుల కోరికలను తీవ్ర కల్పవల్లిగా మహిళలు భావిస్తారు.

వరలక్ష్మి వ్రతం వస్తుందంటే మహిళలకు ఎంతో ఉత్సాహం వస్తుంది. సాంప్రదాయ దుస్తులతో సాక్ష్యాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందా అనే విధంగా అలంకరించుకుంటారు. ప్రతి ఇంటా ఎంతో సందడి నెలకొంటుంది. శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వచ్చే వరలక్ష్మీ వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి గ్రామానికి చెందిన పేరి ఫణి కుమారి వరలక్ష్మీ వ్రతం పూజకు సంబంధించి సొంతంగా విగ్రహాలను తయారు చేయడంతో పాటు వివిధ డెకరేషన్ ఐటమ్స్ ను రూపొందించారు. అష్టలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలతో పాటు ప్రధాన అమ్మవారి విగ్రహాన్ని తయారుచేసి పూజ కు కొలువు తీర్చారు. అరటి చెట్లకు అరటి పళ్ళు గెల ను కృత్రిమంగా తయారుచేసి అలంకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..