Varalakshmi Vratam: 31లక్ష 25,000 వేల కరెన్సీతో అమ్మవారి అలంకారం.. ధనలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం
శ్రావణ రెండో శుక్రవారం సందర్భంగా తెలుగు లోగిళ్ళు శ్రావణ శోభనకు సంతరించుకున్నాయి. మహిళలు తమ ఇంట్లో వరలక్ష్మి దేవిని పూజిస్తూ వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంట్లో పూజ ముగించుకున్న మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా అలంకరించుకుని అమ్మవారి ఆలయాలకు పోటెత్తుతున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అమ్మవారి ఆలయాలన్నీ శ్రావణ వరలక్ష్మీ వ్రత శోభను సంతరించుకున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించారు అర్చకులు. కడియం మండలం కడియపులంక శ్రీముసలమ్మ అమ్మవారు. శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని ధన లక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు. ఈ మేరకు అమ్మవారి అలంకరణ కోసం 31 లక్షల 25 వేల రూపాయల నూతన కరెన్సీ నోట్లను ఉపయోగించారు.
సిరులను కురిపించే ధనలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్నారు కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని చూసి ఎందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తాము ప్రతి సంవత్సరం కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఇలా అలంకరిస్తున్నామని అర్చకులు చెప్పారు. అంతేకాదు ఇలా దేశం సుభిక్షంగా ఉండడం కోసం తాము ఇలా అమ్మవారిని ప్రార్ధిస్తున్నామని అర్చకులు తెలిపారు. స్థానిక భక్తులు నివాసాల్లో వరలక్ష్మి వ్రత పూజలు అనంతరం మహిళలు స్థానిక అమ్మవారు ఆలయాలకు క్యూ కట్టారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..