2024లో పవన్ పోటీ చేసే నియోజకవర్గం అదేనా ??
పవన్ 2024 ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్న ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది.
అయితే ఈ ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరికేసింది.
పవన్ 2024 ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారని తెలుస్తుంది.
ఈ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం భీమవరం అని సమాచారం.
గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కు షాక్ తగిలినా ఈసారి మాత్రం అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
పవన్ గాజువాక లేదా పిఠపురంలలో మరో నియోజకవర్గాన్ని ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంది.
పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి