Sankranti 2023: మకరరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..

జనవరి 14న మకర సంక్రాంతి పండుగ కూడా రాబోతోంది. ఈ క్రమంలోనే సూర్యుడు, శని, శుక్రుడు మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడంతో మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయని..

Sankranti 2023: మకరరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
These 4 Zodiac Signs Will Get Unexpected Changes As Sun Transit Into Capricorn
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 06, 2023 | 5:45 AM

జనవరి నెలలో చాలా గ్రహాలు ఇతర రాశులలోకి ప్రవేశించబోతున్నాయి. దీని ఫలితంగానే ఈ నెలలో కొన్ని రాశుల జీవిత చక్రాల్లో తీవ్ర మార్పులు జరిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జనవరి 14 రాత్రి సూర్యడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంతోనే జనవరి 14న మకర సంక్రాంతి పండుగ కూడా రాబోతోంది. ఈ క్రమంలోనే సూర్యుడు, శని, శుక్రుడు మకరరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడంతో మనిషి జీవితంలో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా జీవితాలలో ఆర్థిక ప్రగతితో పాటు ధనలాభం కూడా కలిగే అవకాశాలున్నాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశువారిపై త్రిగ్రాహి యోగం:

వృషభం: సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం వల్ల  వృషభ రాశి వారికి చాలా  రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాల పరంగా విశేష గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మకర సంక్రమణ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునరాశి: మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మిథునరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వారిపై ఉన్న మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సూర్యభగవానుడి కృప, సహకారంతో ధనలాభం కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది.

కర్కాటకం: ఈ మకర సంక్రమణ కారణంగా కర్కాటక రాశివారికి జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. అంతేకాకుండా ఉద్యోగ జీవితానికి సంబంధించి విషయాల్లో శుభవార్తలు పొందే ఛాన్స్‌ కూడా ఉంది. అవివాహితులకు వివాహాలు కుదిరే అవకాశాలున్నాయి.

వృశ్చిక రాశి: మకర రాశిలోకి సూర్య సంక్రమణం వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు తమ కెరీర్‌లో కొత్త అవకాశాలు పొందే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే వృశ్చిక రాశివారు తమ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి మంచి జీవితాన్ని అనుభవిస్తారు. ఇంకా ఈ సమయంలోనే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం చూడండి..