High BP: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? అయితే బీపీని నియంత్రించే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి..

మనం పాటిస్తున్న కొన్ని రకాల ఆహారపు అలవాట్లే మన ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమని చెప్పుకోవాలి. అయితే మనల్ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి. గుండె ధమనులను దెబ్బతీయడం, గుండెకు రక్తం..

High BP: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? అయితే బీపీని నియంత్రించే ఈ ఆహార పదార్థాల గురించి తెలుసుకోండి..
అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఉప్పులో సోడియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువగా తీసుకోవడం హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 05, 2023 | 4:22 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలనేవి వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. ఇందుకు మనం పాటిస్తున్న కొన్ని రకాల ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. అయితే మనల్ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి. గుండె ధమనులను దెబ్బతీయడం, గుండెకు రక్తం, ఆక్సిజన్ ప్రసరణను తగ్గించడంతోపాటు ప్రసరణ వ్యవస్థపై అధిక రక్తపోటు అనేది ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలతో అనుసంధానమై ఉండే రక్త నాళాలను కూడా అధిక రక్తపోటు దెబ్బతీస్తుంది. హైబీపికి సరైన ట్రీట్‌మెంట్ లేనప్పటికీ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో కొన్ని రకాల మార్పులను చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు.

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. అంతేకాక శ‌రీరంలో సోడియం క‌లిగించే దుష్ప‌రిణామాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గుతాయి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలపై హైబీపితో బాధపడుతున్నవారు అవగాహన కలిగి ఉండటం అవసరం. శరీరంలో పోటాషియం స్థాయిని పెంచడంలోనే కాక ఎన్నో రకాల పోషకాలను అందించే ఈ ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పెరుగు: పెరుగులో కాల్షియం, పొటాషియంలు పుష్క‌లంగా ఉండడం వల్ల ఇవి జీర్ణాశ‌యంలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తాయి. హైబీపీ ఉన్న‌వారికి పెరుగు చ‌క్క‌ని ఆహారం.. దీన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ నియంత్రణలో ఉంటుంది.
  2. అర‌టి పండ్లు: అర‌టి పండ్లలో పుష్కలంగా ఉండే పొటాషియం, విట‌మిన్ సి వంటి పోషకాలు మన శరీర జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. ఫలితంగా ఆక‌లి నియంత్రణలో ఉంటుంది. అర‌టి పండ్ల‌లో అధికంగా ఉండే ఫైబ‌ర్ ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌కుండా కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో అధిక బ‌రువును కూడా చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే అర‌టి పండ్ల‌లో ఉండే పొటాషియం వ‌ల్ల హైబీపీ కూడా త‌గ్గుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు: ఆకుకూర‌ల‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిల్లో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలలో పొటాషియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పాల‌కూర‌లో పొటాషియం స‌మృద్ధిగా ల‌భిస్తుంది. దీన్ని స‌లాడ్లు , జ్యూస్ రూపంలో కూడా తీసుకోవ‌చ్చు. ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శరీరానికి తగిన మోతాదులో పొటాషియం అంది హైబీపీ నియంత్రణలోకి వస్తుంది.
  5. పుచ్చ‌కాయ‌లు: ప్రస్తుతం పుచ్చకాయలు అన్ని సీజన్లలో లభిస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండే ఈ కాయ‌ల్లో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటాంది. పుచ్చ‌కాయ‌ల్లో ఉండే లైకోపీన్‌, విట‌మిన్ ఎ, సి, అమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మ‌న శ‌రీరానికి పోష‌ణ‌ను, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో ఉపకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..