Trimbakeshwar Temple: త్రిమూర్తుల క్షేత్రం.. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం 8 రోజులు మూసివేత, భక్తులు వద్దంటూ విజ్ఞప్తి

ఈ దేవాలయం హిందూ విశ్వాస కేంద్రమే కాదు, చాలా పురాతనమైన దేవాలయం కావడం వల్ల దీనికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. జ్యోతిర్లింగ ఆలయ రక్షణ కోసం.. కొన్ని రోజులు మూసి వేసి ఆలయ మరమ్మతు పనులను ప్రారంభించారు. దీంతో ఈ ఆలయం గురువారం (జనవరి 5) మూతపడింది.   

Trimbakeshwar Temple: త్రిమూర్తుల క్షేత్రం.. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం 8 రోజులు మూసివేత, భక్తులు వద్దంటూ విజ్ఞప్తి
Trimbakeshwar Temple
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2023 | 9:59 AM

హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రం.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి .. త్రయంబకేశ్వరాలయం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంది. ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ శివాలయం కొని రోజుల మూసివేశారు. ఎనిమిది రోజుల పాటు త్రయంబకేశ్వరుడిని  భక్తులు దర్శించుకునే వీలుండదు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు సమాచారం అందించారు. ఈ దేవాలయం హిందూ విశ్వాస కేంద్రమే కాదు, చాలా పురాతనమైన దేవాలయం కావడం వల్ల దీనికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. జ్యోతిర్లింగ ఆలయ రక్షణ కోసం.. కొన్ని రోజులు మూసి వేసి ఆలయ మరమ్మతు పనులను ప్రారంభించారు. దీంతో ఈ ఆలయం గురువారం (జనవరి 5) మూతపడింది.

ఆలయ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ప్రకారం, జనవరి 5, 2023 నుండి జనవరి 12, 2023 వరకు ఆలయాన్ని క్లోజ్ చేశారు. అంతేకాదు ఆలయంలో నిర్వహించే అన్ని పూజలు,  సాంప్రదాయ పద్ధతులు, రోజువారీ కార్యకలాపాలు కూడా నిలిపివేయబడ్డాయి. ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ భక్తులకు దర్శనం అందుబాటులోకి వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

భారత పురావస్తు శాఖ (ASI) పరిరక్షణ:  ఈ పురాతన శివాలయాన్ని పరిరక్షించడమే కాదు.. ఆలయ విశిష్టత గురించి ప్రచారం చేసే పనిని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తోందని ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించబడింది. అటువంటి పరిస్థితిలో, మరమ్మతులు పూర్తయ్యే వరకు వచ్చే ఎనిమిది రోజుల పాటు ఆలయ నిర్వాహకులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రయంబకేశ్వర దేవస్థాన ట్రస్ట్ తరపున ఈ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం జ్యోతిర్లింగం అరిగిపోయినట్లు వార్తలు: కొన్ని రోజుల క్రితం జ్యోతిర్లింగం అరిగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే శివ లింగంపై పూతపూసి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పూర్తయ్యాయి. అయితే  శివలింగం అరిగిపోవడంతో ఆలయ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ఎనిమిది రోజుల సమయం తీసుకున్నారు. చారిత్రక, పవిత్ర పుణ్యక్షేత్రమైన త్రయంబకేశ్వరుని సంరక్షణను చేయనున్నారు.

త్రయంబకం క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని 1730 లో చత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయాన్ని హేమంత్‌పంతీ శైలిలో నల్ల శాణపు రాయిని ఉపయోగిచి నిర్మించారు. లోపలి వైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..