రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలంటే..
25 August 2023
మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాల మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఇప్పుడు అప్పుడు తినేస్తున్నారు.
దీనికి కారణంగా చాలామంది బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాత్రి ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం.
సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య సమయంలో రాత్రి భోజనం చేయడం మానవ ఆరోగ్యానికి మంచిది. జీవనశైలి కారణంగా దానిని ఒక అరగంటకు తగ్గించవచ్చు.
వైద్యులు ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత భోజనం తినకూడదు. ఏవైనా కారణాల వల్ల రాత్రి భోజనానికి ఆలస్యం అయితే తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తినాలి.
కడుపు నిండా తినకూడదు. ఎందుకంటే ఎక్కువగా భోజనం తింటే అది రాత్రి వేళ సరిగ్గా జీర్ణం కాదు. దీంతో మరెన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత కనీసం 20 నుంచి 25 నిమిషాలు నడవాలని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం పడుతున్నారు.
రాత్రి భోజనం చేసిన తర్వాత 2 నుంచి 3 గంటల తర్వాత మాత్రమే నిద్రపోవాలి. తద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. ఇంకా నిద్ర బాగా వస్తుంది.
అయితే నిజం ఏమిటో మనందరికీ తెలుసు. అందరూ రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. కానీ దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి