Acne Prevent Tips: పింపుల్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా..? మొటిమలు మళ్లీ రాకుండా ఉండేందుకు ఏం చేయాలంటే..

చర్మ సంబంధ సమస్యలు, మొటిమలు తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేయటం మంచిది. మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను ఇబ్బంది పెడతాయి. వారి ఆత్మవిశ్వాసం

Acne Prevent Tips: పింపుల్స్ ఎందుకు వస్తాయో మీకు తెలుసా..? మొటిమలు మళ్లీ రాకుండా ఉండేందుకు ఏం చేయాలంటే..
Acne Prevent Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 05, 2023 | 4:55 PM

శరీరమంతటా ఉండే చర్మం కంటే ముఖ చర్మం ఎంతో సున్నితంగా ఉంటుంది. ఇక చర్మ సంరక్షణ అంటేనే పెద్ద సవాలు అని చెప్పుకోవచ్చు. పాటింటే జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కూడా మనపై, చర్మంపై ప్రభావం చూపించవచ్చు. ఈ క్రమంలోనే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వంటివి మనల్ని వేధిస్తుంటాయి. ఇక చర్మంపై మొటిమలు ఏర్పడటానికి శరీరంలోని హార్మోన్లు మార్పులకు గురికావడమే ప్రధాన కారణమని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బాల్యం నుంచి కౌైమార దశ(టీనేజ్)లోకి ప్రవేశించిన యువతీయువకులలో మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఇతర చర్మ సమస్యలు కనిపించడమనేది శరీర ధర్మంలో భాగమే.

హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులతో పాటుగా చర్మంలో ఉండే గ్రంధుల పనితీరు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటివి కూడా ఇందుకు ప్రధాన కారణాలు. ఇక మనపై ఉండే ఒత్తిడి కూడా ఈ మొటిమలకు, మచ్చలకు పరోక్షంగా ఉంటుంది. మనం తీసుకొనే ఆహారంలో సరైన పోషక విలువలుంటే మొటిమలు  తొలగిపోతాయి. అందుకోసం చర్మ సంబంధ సమస్యలు, మొటిమలు తగ్గించడానికి మనం తీసుకునే ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేయటం మంచిది. మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను  ఇబ్బంది పెడతాయి. వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లేలా కూడా చేస్తాయి. సౌందర్యపరంగానే కాకుండా మానసికంగానూ వేధిస్తాయి. అటువంటి సమస్యలకు పరిష్కారం అంటే మొటిమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే.

ఇవి కూడా చదవండి

మొటిమలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:

  1. అయిల్ పదార్ధాలు తినే వారికి అధికంగా మొటిమల సమస్య ఉంటుంది. జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటే నూనె, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. ఇంకా మొటిమలను గిల్లడం వంటివి చేయరాదు. గిల్లితే మొటిమలతో పాటు బ్లాక్‌హెడ్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంది.
  2. ముఖాన్ని సబ్బుతో రోజులో రెండు నుంచి మూడు సార్లు కడుక్కోవాలి. ఇంట్లో తరుచూ దొరికే పండ్లుతో, వెజిటేబుల్స్‌తో చర్మాన్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
  3. చర్మానికి ఉపయోగించే మాస్క్‌లు, ఫేషియల్స్, స్క్రబ్బింగ్లు, సౌందర్య సాధనాలు మీ చర్మ తత్వానికి సరిపోయే విధంగా ఉన్నాయో లేదో తెలుసుకొని వాడుకోవటం మంచిది.
  4. మొటిమల సమస్య ఉన్నవారు ఎక్కువగా నీరు తాగితే మంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటాక్సీన్స్, చెడు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. తద్వారా శరీరం తేలికగా, సున్నితంగా తయారవుతుంది.
  5. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు. స్వీట్స్, కూల్‌డ్రింక్స్ వాడకం తగ్గించాలి.
  6. ఫ్యాట్, నూనె పదార్థాలు, మసాలాలను వారంలో ఒకరోజుకే పరిమితం చేయాలి. సున్నిపిండితో ముఖం కడుక్కోవడం, క్రీమ్‌ల వాడకం తగ్గించడం, సరైన నిద్ర పోవటం వంటి జాగ్రత్తలు పాటించాలి.
  7. అనవసరమైన క్రీములు రాయకూడదు. వీటి వల్ల చర్మంలోని తైల గ్రంథులు మూసుకుపోవడమేకాక మొటిమలు మరింత తీవ్రమవుతాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
  8. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డు లేకుండా చూసుకోవచ్చు.
  9. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ద్వారా కూడా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకు కూడా  ఉపకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..