Star Heroines: నెక్ట్స్ ఏంటి అమ్మడు..? ముద్దుగుమ్మల తదుపరి ప్రాజెక్ట్స్ పై ఆసక్తి..!

నెక్ట్స్ ఏంటి చెప్పుకోండి చూద్దాం..? ఏంటి క్విజ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల విషయంలో జరుగుతున్నదిదే. అభిమానులను కన్ఫ్యూజన్‌లో పెట్టి.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు..?కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లలో ఒక్కసారి కూడా నెక్ట్స్ ఏంటి అనే ఆలోచన లేకుండా కనీసం ఒక్క సినిమానైనా బ్యాక్ అప్ పెట్టుకున్న పూజా హెగ్డే..

Anil kumar poka

|

Updated on: Aug 24, 2023 | 7:35 PM

నెక్ట్స్ ఏంటి చెప్పుకోండి చూద్దాం..? ఏంటి క్విజ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల విషయంలో జరుగుతున్నదిదే.

1 / 9
అభిమానులను కన్ఫ్యూజన్‌లో పెట్టి.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మలు..?

2 / 9
కెరీర్ స్టార్ట్ చేసిన పదేళ్లలో ఒక్కసారి కూడా నెక్ట్స్ ఏంటి అనే ఆలోచన లేకుండా కనీసం ఒక్క సినిమానైనా బ్యాక్ అప్ పెట్టుకున్న పూజా హెగ్డేతో ఇప్పుడు బ్యాడ్ టైమ్ బాగా బంతాట ఆడేస్తుంది.

3 / 9
ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదిప్పుడు. గుంటూరు కారం, ఉస్తాద్‌లను శ్రీలీల, సాక్షి వైద్య లాంటి హీరోయిన్స్ పట్టుకెళ్ళిపోయారు. దాంతో ఫోటోషూట్స్ చేయడం మినహా.. ఏం చేయలేకపోతున్నారు పూజా.

4 / 9
పూజా హెగ్డే మాత్రమే కాదు.. సాయి పల్లవి పరిస్థితి అలాగే ఉందిప్పుడు. కాకపోతే ఈమెకు ఛాన్సులు బాగానే వస్తున్నాయి కానీ ఈమె ఒప్పుకోవట్లేదు. కథలు నచ్చక ఖాళీగా ఉన్నారు సాయి పల్లవి.

5 / 9
తెలుగులో ఈమె నెక్ట్స్ సినిమాపై ఏడాదిగా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉన్నా.. ఈమె మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ సినిమాలో నటిస్తున్నారు సాయి పల్లవి.

6 / 9
అనుష్క శెట్టి పరిస్థితి కూడా ఇంచుమించు పూజా హెగ్డే మాదిరే ఉంది. విడుదలకు సిద్ధంగా ఉన్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఎప్పుడో మూడేళ్ళ కింద సైన్ చేసిన సినిమా. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాకు కమిటే అవ్వలేదు ఈ సీనియర్ హీరోయిన్. రేపు మిస్ శెట్టి విడుదలయ్యాక అసలు అనుష్క సినిమాలు చేస్తారా అనే క్లారిటీ కూడా లేదు.

7 / 9
సమంత సైతం సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అవకాశాలు వస్తున్నా కూడా తన ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకున్నారు స్యామ్. దాంతో ఈమె నెక్ట్స్ సినిమాపై క్లారిటీ రావడానికి ఏడాది టైమ్ పట్టడం ఖాయం. ప్రస్తుతానికి ఖుషితో సెప్టెంబర్ 1న రానున్నారు స్యామ్. దాంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ చేసారు.

8 / 9
అందరూ స్టార్ హీరోయిన్లే.. కానీ వాళ్ల నెక్ట్స్ సినిమా ఏంటో చెప్పలేని పరిస్థితి. అలాగే రాశీ ఖన్నా, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ లాంటి హీరోయిన్లకు కూడా తెలుగులో అవకాశాల్లేవిప్పుడు.

9 / 9
Follow us