Hansika Motwani : బ్లాక్ అండ్ వైట్‌లో బీభత్సం సృష్టిస్తున్న హన్సిక.. అమ్మడి వయ్యారాలకు కుర్రకారు ఫిదా
టాలీవుడ్ లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హన్సిక అందానికి, క్యూట్ నెస్ కు కుర్రాలంతా ఫిదా అయ్యారు. ఆతర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది హన్సిక. ఎన్టీఆర్, రామ్ పోతినేని, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.