Prakash Raj: ఇప్పుడేమంటావ్ రాజా..! చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ప్రకాష్ రాజ్ పై పేలుతున్న పంచ్‌లు
చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా చంద్రుడి పై ల్యాండ్ అయ్యింది. దిగ్విజయంగా చంద్రయాన్ 3 జబ్బిలి పై ల్యాండ్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది.చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్ ను దించిన మొట్టమొదటి దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. చంద్రయాన్ సక్సెస్ అవ్వడంతో దేశమంతా ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తుంది. దేశ ప్రజలందరూ జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇస్రో శాస్త్రవేత్తల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.