Chandrayaan-3: చందమామపై రోవర్ ఎలా దిగిందో చూశారా? వీడియో విడుదల చేసిన ఇస్రో

భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌ 3 ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అయిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్‌ నుండి సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడి ఉపరితలంపైకి రోవర్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితంలపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణానికి సంబంధించి మొత్తం 14 రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది.

Chandrayaan-3: చందమామపై రోవర్ ఎలా దిగిందో చూశారా? వీడియో విడుదల చేసిన ఇస్రో
Chandrayaan 3 Mission
Follow us
Basha Shek

| Edited By: Vimal Kumar

Updated on: Sep 05, 2023 | 3:51 PM

భారత అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌ 3 ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఇప్పటికే జాబిల్లి ఉపరితలంపై ల్యాండ్‌ అయిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్‌ నుండి సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడి ఉపరితలంపైకి రోవర్‌ ల్యాండ్‌ అయ్యింది. ఈ ప్రగ్యాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితంలపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణానికి సంబంధించి మొత్తం 14 రోజులపాటు నిరంతరాయంగా ఫొటోలు పంపనుంది. దక్షిణ ధృవంలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన క్లియర్‌ పిక్చర్స్‌ను తీయనుంది రోవర్‌. చందమామపై వాతావరణం ఎలా ఉంది?, మంచు నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయ్‌?, అక్కడి వాతావరణం మానవ మనుగడకు అనుకూలమా? కాదా?, ఇలా అనేక అంశాలపై అధ్యయనంచేసి ఎప్పటికప్పుడు ఫొటోలు పంపనుంది. కాగా చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియోను విక్రమ్‌ ల్యాండర్‌ ఇస్రోకు పంపింది. దీనిని తమ అధికారిక సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది భారత అంతరిక్ష సంస్థ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చందమామాపై రోవర్ దిగుతున్న వీడియో

కాగా రష్యా, చైనా, అమెరికాల తర్వాత చంద్రుడిపై అడుగపెట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే ఏ దేశానికి సాధ్యంకాని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 నిమిషాలకు విజయవంతంగా విక్రమ్‌ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యింది. దీంతో  మరోసారి ప్రపంచ దేశాలన్ని భారతదేశం వైపు చూశాయి.  ఇక జాబిల్లిపై ల్యాండ్ అయిన విక్రమ్ తన పని మొదలు పెట్టింది. ఎప్పటికప్పుడు చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ఫొటోలను బెంగళూరులోకి ఇస్రో కార్యాలయానికి పంపుతోంది.

చంద్రుడి ఉపరితలం ఫొటోస్ ఇదుగో

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..