వీడు మనిషి కాదు మృగం.. పదో అంతస్తు నుంచి మూడు కుక్కపిల్లలను

పెంపుడు కుక్కలను పెంచుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. మరికొందకీ ఇది నచ్చదు. పెంపుడు శునకాలకి సరిగా తిండి పెట్టలేకపోతున్నామని లేదా వాటిని పట్టించుకోకపోతున్నామని ఇంటి యజమానులు భావిస్తే వాటిని బ్లూ క్రాస్ వాళ్లకి అప్పగించడం లేదా ఎవరికైన అమ్మడం లాంటివి చేస్తుంటారు.

వీడు మనిషి కాదు మృగం.. పదో అంతస్తు నుంచి మూడు కుక్కపిల్లలను
Pet Dogs
Follow us
Aravind B

|

Updated on: Mar 16, 2023 | 3:46 PM

పెంపుడు కుక్కలను పెంచుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. మరికొందకీ ఇది నచ్చదు. పెంపుడు శునకాలకి సరిగా తిండి పెట్టలేకపోతున్నామని లేదా వాటిని పట్టించుకోకపోతున్నామని ఇంటి యజమానులు భావిస్తే వాటిని బ్లూ క్రాస్ వాళ్లకి అప్పగించడం లేదా ఎవరికైన అమ్మడం లాంటివి చేస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఇంటియజమాని మాత్రం కుక్కలపై క్రూరంగా ప్రవర్తించాడు. తాను ఉండే అపార్టుమెంట్ లోని పదవ అంతస్తు పై నుంచి ఆ కుక్క పిల్లల్ని కింద పడేసి వాటి మరణానికి కారణమయ్యాడు. నోయిడాలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో నివాసం ఉంటున్న శేఖర్ అనే వ్యక్తికి ఓ పెంపుడు కుక్క ఉండేది. అది ఇటీవలే ఆరు పిల్లలకి జన్మనిచ్చింది. అయితే ఇందులో ఉన్న మూడు కుక్కపిల్లలను శేఖర్ తాను పైన ఉంటున్న ఇంటి నుంచి వాటిని కిందపడేశాడు. దీంతో సుమారు ఒక నెల వయసు మాత్రమే ఉన్న ఆ కుక్కపిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి.

అపార్ట్ మెంట్ ఓనర్ అసోసియేషన్ వాళ్లు ఆ కుక్క పిల్లలు చనిపోయినట్లు గుర్తించారు. అవి ఎవరివీ అన్న విషయంపై ఆరా తీయాగా శేఖర్ వి అని గుర్తించారు. వెళ్లీ చూస్తే అతను అక్కడ లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శేఖర్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై జంతు హక్కల సంఘం సభ్యులు విచారం వ్యక్తం చేశారు. పెంపుడు శునకాలను యజమాని చంపడం దారణమని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చంపకుండా ఎదైనా షెల్టర్ కు పంపించవచ్చు కదా అని వాపోయారు. ఆ కుక్క పిల్లలను పోలీసులు పోస్టు మార్టానికి తరలించారు. దీనిపై మరింత ఆధారాలు సేకరించేందుకు విచారణ ఇంకా కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..