Viral Video: చెప్పులేసుకుని టిప్ టాప్‌గా ఫ్లైట్ దిగిన ప్యాసింజర్.. అనుమానం వచ్చి ఆరా తీయగా.. షాకింగ్ సీన్..
రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఓ వ్యక్తి స్లిప్పర్ చెప్పులతో కనిపించాడు. అయితే, అధికారులు తనను గుర్తించరేమోననుకున్నాడు.. కానీ.. కొంచెం తేడాగా కనిపించడంతో..
రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఓ వ్యక్తి స్లిప్పర్ చెప్పులతో కనిపించాడు. అయితే, అధికారులు తనను గుర్తించరేమోననుకున్నాడు.. కానీ.. కొంచెం తేడాగా కనిపించడంతో అధికారులు అతన్ని ఆపి చెక్ చేశారు. అంతా బాగానే ఉంది.. కానీ.. ఇంకెదో తేడా కొడుతుందని అధికారులకు అనుమానం వచ్చింది. చివరగా.. ఆ వ్యక్తి వేసుకున్న చెప్పులను తనిఖీ చేశారు అధికారులు.. అప్పుడే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి మామూలోడు కాదు.. పెద్ద స్మగ్లర్.. అని.. చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి.. ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
బెంగళూరు విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 69.40 లక్షల విలువైన బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బుధవారం బ్యాంకాక్ నుంచి బెంగళూరుకి వచ్చిన ప్రయాణికుడిని.. కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించగా.. సరైన జవాబు చెప్పలేదు.. పైగా తాను చికిత్స కోసం వచ్చినట్లు అధికారులకు ఏదేదో పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో అధికారులు దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను చూపించమని అడిగారు. అతను చూపకపోవడంతో అనుమానం వచ్చి క్షణ్ణంగా పరిశీలించారు.
వీడియో చూడండి..
ఈ క్రమంలో అతను ధరించిన చెప్పుల్లో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు కొనుగొని స్వాధీనం చేసుకున్నారు. 1.2 కిలోల 24 క్యారెట్ల బంగారంను ప్రయాణికుడినుంచి స్వాధీనం చేసుకున్నామని.. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 70 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..