Vande Bharat Watch Video: మరో సరికొత్త రికార్డు.. వందేభారత్ రైలు నడిపిన సురేఖ యాదవ్.. 5 నిమిషాల ముందే..
సురేఖ యాదవ్.. ఓ చరిత్ర సృష్టించారు. సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. అన్నింట్లో సమానం అని నిరూపించారు. అత్యంత క్లిష్టమైన దారిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపి..
ఆకాశంలో సగభాగం కాదు.. అవకాశాల్లోనూ సగం.. పదవుల్లోనూ ప్రాధాన్యం.. పరిపాలనలో స్వేచ్ఛ.. అన్నదానికి ఇదిగో ఈమే నిదర్శనం. పేరు సురేఖ యాదవ్. సరికొంత్త చరిత్రను లిఖించారు. దేశంలోని మహిళలందరికీ రోల్ మోడల్‌గా నిలిచారు. 34 ఏళ్ల కెరీర్‌లో సురేఖ ఇలాంటి ఎన్నో పనులు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపిన తొలి మహిళ లోకోపైలట్‌గానూ సురేఖ యాదవ్ హిస్టరీ క్రియేట్ చేశారు. షోలాపూర్–ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ (సీఎస్‌ఎంటీ) మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో లోకోపైలట్ (డ్రైవర్)గా సురేఖ యాదవ్ విధులు నిర్వహించారు. షోలాపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం సీఎస్‌ఎంటీ దిశగా బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పగ్గాలను రైల్వే అధికారులు సురేఖకు అప్పగించారు. ఈ సందర్భంగా మార్చి 13న వందే భారత్ రైలుతో ముంబయి స్టేషన్‌కు చేరుకోవడంతో ఆమె పేరులో సరికొత్త ఘనత రికార్డ్ అయ్యింది. 34 ఏళ్ల కెరీర్‌లో సురేఖ ఇలాంటి ఎన్నో పనులు చేసి దేశంలోని మహిళలందరికీ రోల్ మోడల్‌గా నిలిచే మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె పురుషులతో సరిసమానంగా పనిచేస్తున్నారు.
34 సంవత్సరాలుగా భారతీయ రైల్వేలో వివిధ సేవలందిస్తున్న సురేఖ యాదవ్‌కు గూడ్స్ రైళ్లు, ప్యాసింజరు రైళ్లు నడిపిన అనుభవముంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న కల నెరవేర్చుకున్నారు. ఈ గౌరవం ఇచ్చినందుకు భారతీయ రైల్వేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. షోలాపూర్ నుంచి సోమవారం మధ్యాహ్నం టైంటేబుల్ ప్రకారం బయలుదేరిన ఈ రైలును సీఎస్‌ఎంటీకి ఐదు నిమిషాల ముందే చేర్చారు.
ముంబయి రైల్వే స్టేషన్‌కు ఆమె చేరుకోవడంతో ఘన స్వాగత లభించింది. ఖండాలా–కర్జత్ మధ్య ఘాట్ సెక్షన్‌లో రైలు నడపడమంటే లోకోపైలట్‌కు కత్తిమీద సాములాంటిదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా వందేభారత్‌కు ప్రత్యేకంగా ఇంజిన్ అంటూ ఉండదు. మధ్యలో అక్కడక్కడా మూడు చోట్ల పెంటాగ్రాఫ్‌తో కనెక్టివిటీ అయ్యే పవర్ మోటర్లు ఉంటాయి. అయినప్పటికీ ఎంతో చాకచక్యంగా రైలును నడిపిన సురేఖ.. ఐదు నిమిషాల ముందే గమ్యస్థానానికి చేర్చారు. దీంతో అంతా సంబరపడిపోయారు. స్టేషన్ మొత్తం చప్పట్లతో మునిగిపోయింది.
ప్రధాని మోదీకి వందే భారతదేశపు మొదటి మహిళా డ్రైవర్‌గా అవతరించినందుకు ధన్యవాదాలు తెలిపారు సురేఖ యాదవ్. ‘నేను 1989లో నియమితులయ్యాను. నేను గత 34 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. నా తల్లిదండ్రులు, అత్తమామల సపోర్ట్ నాకు లభించింది. మా నాన్న నాకు మంచి విద్యను అందించారు. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వందేభారత్ రైలును ముంబైకి తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
వీడియోను ఇక్కడ చూడండి..
Salute to #Narishakti!
Smt. Surekha Yadav, Loco Pilot cruising the first female driven Vande Bharat train from CSMT, Mumbai to Solapur through the steepest Bhor Ghat between Mumbai & Pune in Maharashtra. pic.twitter.com/WWKiUIXYrx
— Ministry of Railways (@RailMinIndia) March 15, 2023
ఆసియాలో తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ యాదవ్.. మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు. ఇక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఆమె లోకో పైలట్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అప్పుడు, స్త్రీలు పురుషులతో పోటీ పడలేరు అనేది ఉండేది. ఈ అపనమ్మకాన్ని బ్రేక్ చేశారు. అంతకు ముందు భారతీయ రైల్వేలో మహిళా డ్రైవర్ లేరు. అసిస్టెంట్ లోకో పైలట్‌గా ఉద్యోగం ప్రారంభించారు.
ముంబై-పూణె-సోలాపూర్ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అవకాశం ఆమెకు ఇప్పుడు లభించింది. 2021లో ఒక ఇంటర్వ్యూలో సురేఖ యాదవ్ వందే భారత్ రైలును నడపాలని తన కోరికను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె కోరిక తీరినట్లైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం