National: ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకుని ఉద్యోగంలో చేరితే.. ప్రాణమే పోయింది.. అసలేం జరిగిందంటే.
సమాజంలో గౌరవంతో జీవించాలనుకునే మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఉద్యోగం చేస్తూ మగవారికి సమానంగా రాణించాలనుకునే వారికి వేధింపులు తప్పడం లేదు. కామాంధుల దాష్టికానికి ఈ సమాజంలో గౌరవంగా కాదు అసలు..
సమాజంలో గౌరవంతో జీవించాలనుకునే మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఉద్యోగం చేస్తూ మగవారికి సమానంగా రాణించాలనుకునే వారికి వేధింపులు తప్పడం లేదు. కామాంధుల దాష్టికానికి ఈ సమాజంలో గౌరవంగా కాదు అసలు బతకడమే భారంగా మారిపోయింది. తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటననే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. ఓ మహిళ జీవితాన్ని చిదిమేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
కర్ణాటలోని మడికెరి తాలూకా కగ్గోడ్లు గ్రామానికి చెందిన సౌమ్య ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఉద్యోగంలో చేరింది. మే నెలలో మడికెరి సెస్కాం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరారు. అయితే అదే కార్యాలయంలో సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వినయ్ కన్ను ఆమెపై పడింది. లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. చేయమని, వాట్సాప్‌లో చాట్ చేయమంటూ సౌమ్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని సౌమ్య మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
తన భార్యను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినయ్.. వేధించాడని సౌమ్య భర్త, రిటైర్డ్ జవాన్ తెలిపారు. ఆమె భర్త మడికెరి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏఈఈ వినయ్‌పై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..