Hari Hara Veera Mallu: ఆ పండగను టార్గెట్ చేసిన హరిహర వీరమల్లు.. చకచకా పనులు
వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వీటిలో ముందు క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు రాజకీయాలతో.. ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్. వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వీటిలో ముందు క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.
ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట మేకర్స్.. ఈ మేరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాతో పాటు సముద్రఖని డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమాలో మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు.
ఇక హరిహర వీర మల్లు సినిమాతో పాటు దసరాకు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. రామ్ – బోయపాటి సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే విజయ్ చేస్తోన్న లియో సినిమా కూడా దసరా కానుకగా రిలీజ్ కానుంది. అలాగే రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా అక్టోబర్ 20న రానున్నట్టు ప్రకటించారు.