Ramabanam: రామ నామమే జయం.. రామ బాణమే విజయం.. ఆకట్టుకుంటున్న పోస్టర్

తనకు సక్సెస్ ఇచ్చిన శ్రీవాస్ తో కలిసి సినిమా చేస్తున్నారు. గతంలో గోపీంచద్ శ్రీవాస్ కాంబోలో లక్ష్యం లౌక్యం చిత్రాలు కూడా తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.

Ramabanam: రామ నామమే జయం.. రామ బాణమే విజయం.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Rama Banam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 31, 2023 | 10:28 AM

కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నారు గోపీచంద్. అప్పుడెప్పుడో హిట్ అనే పదం విన్నారు హీరో గోపీచంద్. ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు గోపీచంద్. ఇక ఇప్పుడు తనకు సక్సెస్ ఇచ్చిన శ్రీవాస్ తో కలిసి సినిమా చేస్తున్నారు. గతంలో గోపీంచద్ శ్రీవాస్ కాంబోలో లక్ష్యం లౌక్యం చిత్రాలు కూడా తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు రామబాణం అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నారు గోపీచంద్.ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసింది ఎవరో అందరికి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ గోపీచంద్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తోంది.

తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమానుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో గోపీచంద్ తో పాటు జగపతి బాబు కూడా ఉన్నారు. ఈ సినిమాలో గోపీచంద్, జగపతి బాబు ఇద్దరు అన్న తమ్ముడుగా నటించనున్నారని తెలుస్తోంది.

ఈ పోస్టర్ లో ఇద్దరూ వైట్ పంచలు కట్టుకొని.. తలకు పాగా చుట్టి నుదుటిన కుంకుమ విభూది ధరించి హుందాగా కనిపించరు. సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య  ఇతరపత్రాల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.