Taraka Ratna: కూతురితో ఆఖరిసారిగా వీడియో గేమ్‌ ఆడిన తారకరత్న.. వీడియోను షేర్‌ చేసిన నిష్క

పెద్దలను ఎదిరించి తారకరత్నతో జీవితం పంచుకున్న అలేఖ్యా రెడ్డిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. అదే సమయంలో చేయి పట్టి నడిపించే నాన్న దూరం కావడంతో కూతురు నిష్క కన్నీరు మున్నీరవుతోంది.

Taraka Ratna: కూతురితో ఆఖరిసారిగా వీడియో గేమ్‌ ఆడిన తారకరత్న.. వీడియోను షేర్‌ చేసిన నిష్క
Taraka Ratna
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2023 | 1:00 PM

టాలీవుడ్‌ నటుడు నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు నెల రోజులవుతోంది. జనవరి 27న నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. ఆ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఫిబ్రవరి 18న కన్నుమూశారు. చిన్న వయసులోనే తారకరత్న కన్నుమూయడం ఆయనక కుటుంబాన్ని బాగా కుంగదీసింది. ముఖ్యంగా పెద్దలను ఎదిరించి తారకరత్నతో జీవితం పంచుకున్న అలేఖ్యా రెడ్డిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. అదే సమయంలో చేయి పట్టి నడిపించే నాన్న దూరం కావడంతో కూతురు నిష్క కన్నీరు మున్నీరవుతోంది. ఇప్పటికీ తారకరత్న జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నారీ తల్లీ కూతుళ్లు. అప్పుడప్పుడూ తారకరత్నపై ఉన్న ప్రేమను, అలాగే అతను దూరమైనందుకు తాము పడుతున్న బాధను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా కూతురు నిష్క తండ్రితో కలిసి ఆడుకున్న ఆఖరి వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. హిందూపూర్‌కు వెళ్లడానికి ముందు కూతురితో కలిసి సరదాగా గేమ్‌ ఆడారు తారకరత్న.

దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నిష్క.. ‘గేమింగ్.. హిందూపూర్ వెళ్లడానికి ముందు రోజు సాయంత్రం ఓబు ( తారక రత్న ముద్దు పేరు)తో ‘ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం ఇలాగే ఉంటుందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది తారకరత్న కూతురు నిష్క. మొదట తండ్రి తారక రత్నతో దిగిన ఫొటోను నిష్క పోస్ట్ చేసింది. తను షేర్‌ చేసిన తొలి పోస్ట్ ఇదే. దీనికి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ రెండు లవ్ ఎమోజీలను జత చేసింది. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫొటోను షేర్‌ చేసి.. ‘మై పేరెంట్స్! వీళ్లే నా బలం, నా ప్రేమ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. తాజాగా తన తండ్రితో గేమ్‌ ఆడుతున్న వీడియోను షేర్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..