Manchu Family: సారథిని చావబాదిన విష్ణు.. ముఖానికి గాయాలు.. తలుపుకు గొళ్లెం వెయ్యకపోయి ఉంటే..

మంచు విష్ణు, మనోజ్‌ గొడవపై మోహన్‌బాబు స్పందించారు. ఆవేశం అన్నింటికీ అనర్థమని.. సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Manchu Family: సారథిని చావబాదిన విష్ణు.. ముఖానికి గాయాలు.. తలుపుకు గొళ్లెం వెయ్యకపోయి ఉంటే..
Manchu Vishnu
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2023 | 12:42 PM

మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య వివాదంపై క్లారిటీ వస్తుంది. మోహన్ బాబు సమీప బంధువు సారథి.. విష్ణు ఫిల్మ్ కెరీర్ ప్రారంభం నుంచి.. అతని వెన్నంటే ఉంటున్నారు. ఇటీవల కాలంలో విష్ణుకు దూరంగా జరిగి.. మనోజ్‌కు సారథి దగ్గరయ్యారు. తమ మధ్య విబేధాలు సృష్టిస్తున్నాడని, తన గురించి అనుచితంగా మాట్లాడుతున్నాడని.. గత రాత్రి సారథి ఇంటికి వెళ్లాడు విష్ణు. ఆగ్రహంతో రగిలిపోతూ సారథిపై విష్ణు దాడి చేశాడు. ఇష్టమొచ్చినట్లు చావబాదాడు. దీంతో సారథి ముఖానికి గాయాలయ్యాయి. విషయాన్ని మనోజ్, విష్ణులకు తెలియజేశారు సారథి కుటుంబ సభ్యులు. వారు అక్కడికి చేరుకునే సరికే దెబ్బలకి తాళలేక.. బయటకు పరుగులు తీశాడు సారథి. విష్ణు తన వెంట పడకుండా.. ఇంటి బయట గొళ్లెం పెట్టి ఆస్పత్రికి వెళ్లాడు సారథి.

ఆ తర్వాత మనోజ్, లక్ష్మీ అక్కడికి చేరకున్నారు. ఆ సందర్భంలో డోర్‌ను లోపలి నుంచి లాగుతున్నాడు విష్ణు. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించి.. ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి.. ఆగ్రహం వ్యక్తం చేశాడు మనోజ్. విష్ణుకు సారథి కుటుంబ సభ్యులు సర్ది చెప్పేందుకు సారథి కుటుంబ సభ్యలు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మనోజ్ పోస్ట్ చేసిన వీడియోలో రికార్డయ్యాయి. కాగా మోహన్ బాబు వారించడంతో.. ఆ వీడియోను డిలీట్ చేశాడు మనోజ్. ప్రజంట్ ఆయన తన కుమారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..