Jailer Movie Review: రజినీకాంత్ జైలర్ మూవీ ఫుల్ రివ్యూ.. అదరగొట్టిన సూపర్ స్టార్

రజినీకాంత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలుంటాయి. కొన్నేళ్లుగా వాటిని అందుకోవడంలో వెనకబడుతున్నారు రజినీకాంత్. తాజాగా నెల్సన్ తెరకెక్కించిన జైలర్‌తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చారు సూపర్ స్టార్. మరి ఈ సారైనా అంచనాలు అందుకున్నారా..? జైలర్ ఎలా ఉన్నాడు..? మన ప్రేక్షకులకు నచ్చుతాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Jailer Movie Review: రజినీకాంత్ జైలర్ మూవీ ఫుల్ రివ్యూ.. అదరగొట్టిన సూపర్ స్టార్
Jailar
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 10, 2023 | 1:10 PM

మూవీ రివ్యూ: జైలర్

నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగబాబు, యోగి బాబు మరియు తదితరులు

సంగీతం: అనిరుద్ రవిచంద్రన్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: ఆర్.నిర్మల్

దర్శకుడు : నెల్సన్ దిలీప్ కుమార్

నిర్మాతలు: కళానిధి మారన్

రజినీకాంత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలుంటాయి. కొన్నేళ్లుగా వాటిని అందుకోవడంలో వెనకబడుతున్నారు రజినీకాంత్. తాజాగా నెల్సన్ తెరకెక్కించిన జైలర్‌తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చారు సూపర్ స్టార్. మరి ఈ సారైనా అంచనాలు అందుకున్నారా..? జైలర్ ఎలా ఉన్నాడు..? మన ప్రేక్షకులకు నచ్చుతాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ముత్తువెల్ పాండియన్ (రజినీకాంత్) తీహార్ జైల్లో చాలా స్ట్రిక్ట్ జైలర్. అక్కడ ఆయన చెప్పిందే వేదం.. ఆయన రాసిందే శాసనం. రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా తన కుటుంబంతో పాటు ఉంటాడు. మనవడితో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. ముత్తు కొడుకు ఏసిపి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. అయితే ఓ పెద్ద కేసును చేధించే క్రమంలో ముత్తు కొడుకుని కొందరు చంపేస్తారు. కొడుకు చావుకి ప్రతీకారంగా ముత్తు హత్యలు చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే ఆయనకు కొన్ని దారుణమైన నిజాలు తెలుస్తాయి.. ఆయన చేసే హత్యల కారణంగా ముత్తు ఫ్యామిలీ కూడా డేంజర్‌లోకి వెళ్తుంది. అప్పుడే ఆయనకు బెంగళూరు నుంచి శివన్న (శివరాజ్ కుమార్), ముంబై నుంచి మ్యాత్యూ (మోహన్ లాల్) హెల్ప్ చేయడానికి వస్తారు. అసలు ముత్తుకు వాళ్లకేంటి సంబంధం..? అంతా ఒకే చోట ఎలా కలిసారు అనేది అసలు కథ..

కథనం: రజనీకాంత్ ను స్క్రీన్ పై ఎలాగైతే చూడాలని కొన్నేళ్లుగా ఫ్యాన్స్ కలలు కంటున్నారో.. అచ్చంగా అలా డిజైన్ చేసిన సినిమా జైలర్. ఇందులోనూ కొన్ని లోపాలున్నాయి కానీ.. విజిల్ వేసే మూమెంట్స్ కూడా చాలానే రాసుకున్నాడు దర్శకుడు నెల్సన్. రజినీకాంత్‌ను తాను చూసుకుంటే.. రజినీ సినిమాను చూసుకుంటాడని ఫిక్సైపోయాడు నెల్సన్. ముఖ్యంగా ప్రతీ సీన్ లో రజిని ఇమేజ్ వాడుకుంటూ.. నెల్సన్ రాసుకున్న క్యారెక్టర్జేషన్ సినిమాకు హైలైట్. ఒక కామన్ జైలర్ కు ఇంత పెద్ద నెట్ వర్క్ ఉంటుందా.. ఇండియాను షేక్ చేయగలడా అంటే చేయలేడు.. కానీ రజనీకాంత్ చేయగలడు. లాజిక్ లేని సన్నివేశాలను కూడా రజనీ ఇమేజ్ మ్యాజిక్ చేసింది. ఫస్టాఫ్ అదిరిపోయింది.. ఇటు ఫ్యామిలీ సెంటిమెంట్.. అటు యాక్షన్.. ఇంకోవైపు కామెడీ అన్నింటిని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశాడు నెల్సన్. ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్.. అది స్క్రీన్ మీద జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. ఫస్టాఫ్ ఇంత హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడే అసలు సమస్య మొదలైంది. మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత దర్శకుడికి చెప్పడానికి కూడా ఏం కథ లేదు. దాంతో మధ్యలో తమన్నా, సునీల్ తో కాసేపు టైంపాస్ చేసినట్లు అనిపించింది.

మన సినిమాల్లో శ్రీను వైట్ల ఎలాగైతే బ్రహ్మానందంను వాడుకుంటాడో.. అచ్చంగా అలాగే సునీల్, తమన్నా సీన్స్ రాసుకున్నాడు నెల్సన్. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ జైలర్ డ్యూటీ ఎక్కాడు. శివన్న, మోహన్ లాల్ క్యారెక్టర్స్ ను నెల్సన్ వాడుకున్న తీరు అద్భుతం. క్లైమాక్స్ లో రజిని ఫ్యాన్ కానీ వాళ్లు కూడా స్క్రీన్ మీద జరిగే మ్యాజిక్ చూసి విజిల్ వేస్తారు. డాక్టర్, బీస్ట్ మాదిరే ఇందులోనూ యాక్షన్ తో పాటు కామెడీ కి పెద్ద పీట వేశాడు నెల్సన్. యోగిబాబు, రజనీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా జైలర్ బాగానే అలరిస్తుంది.

నటీనటులు: రజినీకాంత్ గురించి ఏం చెప్పాలి.. 72 ఏళ్ల వయసులో స్క్రీన్ మీద షేక్ చేశాడు ఆయన. సూపర్ స్టార్ స్టైల్ కు ఫిదా అవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్‌లో వింటేజ్ రజినీకాంత్ కనిపిస్తాడు. సెకండాఫ్ మొదట్లోనే వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రజినీ లుక్ భలేగా సెట్ అయింది. సినిమాలో హీరోయిన్ తమన్నా కాదు రమ్యకృష్ణ. నీలాంబరిగా నరసింహాలో అదరగొట్టిన ఈమె.. ఇందులో అనుకువగా ఉండే ఇల్లాలిగా మెప్పించింది. తమన్నా కారెక్టర్ ఉన్నా లేనట్టే.. సునీల్ కూడా అంతే. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కారెక్టర్స్ బాగున్నాయి.. ఎక్కడెక్కడ వాళ్ల ఇమేజ్ వాడుకోవాలో అక్కడక్కడ వాడేసారు దర్శకుడు నెల్సన్. యోగిబాబు కామెడీ బాగుంది. విలన్ వీక్‌గా ఉన్నాడు. టెక్నికల్ టీం: అనిరుధ్ జైలర్ సినిమాకు మరో హీరో.. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్‌లో మనోడి మ్యూజిక్ అరాచకం. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్‌లో వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చెప్పడానికి లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కాస్త ట్రిమ్ చేయాల్సింది కానీ అది దర్శకుడి నిర్ణయం కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టలేం. దర్శకుడిగా నెల్సన్ బాగా చేసాడు కానీ రైటర్‌గా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా సెకండాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది.

పంచ్ లైన్: ఓవరాల్‌గా జైలర్.. కొన్ని లోపాలున్నా ఎంజాయ్ చేయొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..