Super Star Rajni Kanth: జైలర్ మూవీపై విజయ్ ఫ్యాన్స్ నెగెటివ్ రివ్యూ.. దాడి చేసిన రజనీకాంత్ ఫ్యాన్స్..

చెన్నైలోని వెట్రి థియేటర్‌లో చోటు చేసుకుంది. రజనీకాంత్ అభిమానులు తమ అభిమాన హీరో నటించిన కొత్త సినిమా జైలర్ సూపర్ హిట్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విజయ్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అంతేకాదు కొంతమంది విజయ్ అభిమానుల్లో కొందరు రజనీకాంత్ కొత్త సినిమాపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు.

Super Star Rajni Kanth: జైలర్ మూవీపై విజయ్ ఫ్యాన్స్ నెగెటివ్ రివ్యూ.. దాడి చేసిన రజనీకాంత్ ఫ్యాన్స్..
Rajani Fans Vs Vijay Fans
Follow us
Surya Kala

|

Updated on: Aug 11, 2023 | 9:16 AM

సినీ పరిశ్రమలోని హీరోలు అందరూ స్నేహ భావంతోనే ఉంటారు.. అయితే ఆ హీరోలను అభిమానించే అభిమానులు మాత్రం.. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ గొడవలకు దిగుతారు. ఒకేఒక్కసారి శృతి మించి ప్రాణాలకు తీసుకునే వరకూ వెళ్లారు కూడా.. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఎక్కుగా దక్షిణాదిలో చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ విషయంలో దళపతి విజయ్‌, రజనీకాంత్‌ అభిమానులు పరస్పరం ఘర్షణకు దిగారు. జైలర్ సినిమాపై విజయ్ అభిమానులు నెగిటివ్ రివ్యూ ఇచ్చారని రజనీకాంత్ ఫ్యాన్స్ ఆరోపించారు. ఈ విషయంపై రజినీ అభిమానులు తలపతి విజయ్ ఫ్యాన్స్ ను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన చెన్నైలోని ఓ థియేటర్ చోటు చేసుకుంది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.

సమాచారం ప్రకారం ఈ మొత్తం వ్యవహారం చెన్నైలోని వెట్రి థియేటర్‌లో చోటు చేసుకుంది. రజనీకాంత్ అభిమానులు తమ అభిమాన హీరో నటించిన కొత్త సినిమా జైలర్ సూపర్ హిట్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో విజయ్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. అంతేకాదు కొంతమంది విజయ్ అభిమానుల్లో కొందరు రజనీకాంత్ కొత్త సినిమాపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో రజనీకాంత్ అభిమానులకు కోపం వచ్చింది. దీంతో విజయ్ ఫ్యాన్స పై దాడి చేశారు.

ఫ్యాన్స్ మధ్య ఘర్షణ

రజనీకాంత్ అభిమానులు ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ మొత్తం వివాదంతో అక్కడ ఉన్న  వాతావరణంలో పూర్తి మార్పులొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, ఈ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్‌పై కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం కూడా ప్రారంభించారు. అదే సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి పనిచేయడం గురించి మరోసారి ఆలోచించమని తన అభిమానులు తనను కోరినట్లు రజనీకాంత్ బహిరంగంగా చెప్పారు. అంతేకాదు  దళపతి విజయ్ నటించిన మృగం చిత్రంకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. దీంతో రజనీకాంత్ ఈ డైరెక్టర్ తో సినిమా చేయవద్దు అంటూ సూచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..