Suma Kanakala: సంచలన నిర్ణయం తీసుకున్న సుమ.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకరమ్మ .. షాక్ అవుతోన్న నెటిజన్లు

సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు.

Suma Kanakala: సంచలన నిర్ణయం తీసుకున్న సుమ.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకరమ్మ .. షాక్ అవుతోన్న నెటిజన్లు
Suma Kanakala
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 27, 2022 | 5:01 PM

బుల్లితెరపై దాదాపు 15ఏళ్లకు పైగా యాంకర్ గా రాణిస్తున్నారు సుమ. తెలుగమ్మాయి కాకపోయినా సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత యాంకరింగ్ లో దూసుకుపోతున్నారు. సుమ కెరీర్ బినింగ్ లో పలు సీరియల్స్ లో నటించారు అలరించారు సుమ. తాజాగా సుమ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పి షాక్ ఇచ్చారు.

ఇటీవల జరిగిన ఓ షోలో సుమ మాట్లాడుతూ.. తాను యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వ్వనున్నట్టు తెలిపి షాక్ ఇచ్చారు. తన టైమింగ్ లో మాటకారీ తనంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుమ. ఇక యాంకరింగ్ కు కొంతకాలం బ్రేక్ ఇవ్వనున్నట్టు తేలిన సుమ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ మేరకు ఒక ప్రోమోను విడుదల చేశారు. తాను మలయాళీని అయినా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుని ప్రేమించారని సుమ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే కొంతకాలం యాంకరింగ్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత ఆర్టిస్టులు సుమకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 31నుంచి జనవరి 1వరకే సుమ బ్రేక్ ఇస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి