Ramabanam Review: ‘రామబాణం’ మూవీ రివ్యూ.. ఈసారైనా గోపిచంద్ హిట్టు కొట్టినట్టేనా ?..

లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రామబాణం. మరి ఇది ప్రేక్షకులను మెప్పించిందా.. 9 సంవత్సరాల తర్వాత గోపీచంద్ కోరుకున్న విజయాన్ని అందించిందా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Ramabanam Review: 'రామబాణం' మూవీ రివ్యూ.. ఈసారైనా గోపిచంద్ హిట్టు కొట్టినట్టేనా ?..
Ramabanam
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 05, 2023 | 11:54 AM

మూవీ రివ్యూ: రామబాణం

నటీనటులు: గోపీచంద్, జగపతిబాబు, కుష్బూ, డింపుల్ హయతి, అలీ తదితరులు

సంగీతం: మిక్కీ జే మేయర్

ఇవి కూడా చదవండి

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి

నిర్మాత: టిజి విశ్వప్రసాద్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీవాస్

లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రామబాణం. మరి ఇది ప్రేక్షకులను మెప్పించిందా.. 9 సంవత్సరాల తర్వాత గోపీచంద్ కోరుకున్న విజయాన్ని అందించిందా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

విక్కీ (గోపిచంద్) చిన్నప్పుడే తన అన్నయ్య రాజారాం (జగపతిబాబు)తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. కలకత్తా చేరి అక్కడ పెద్ద డాన్ అయిపోతాడు. అదే సమయంలో విక్కీ జీవితంలోకి భైరవి (డింపుల్ హయతి) వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో 14 సంవత్సరాల తర్వాత మళ్లీ కుటుంబం దగ్గరికి విక్కీ వెళ్లాల్సి వస్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం సమస్యల్లో ఉందని తెలుసుకుంటాడు. తన అన్నయ్య చేస్తున్న ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ కు ఒక పెద్ద బిజినెస్ మాన్ (తరుణ్ అరోరా) అడ్డుపడుతున్నట్టు తెలుసుకుంటాడు విక్కి. ఆ తర్వాత విక్కీ ఏం చేశాడు అనేది మిగిలిన కథ..

కథనం:

చిన్నప్పుడే హీరో ఇంటి నుంచి పారిపోవడం.. బయటికి వెళ్లి ఒక పెద్ద స్థాయికి చేరుకోవడం.. ఎదిగే క్రమంలో కొన్ని తప్పులు చేయడం.. ఆ తర్వాత మళ్లీ సొంత ఇంటికి వచ్చి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను బయటపడేయడం ఈ కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని వందల సినిమాలు వచ్చి ఉంటాయి. తాజాగా గోపీచంద్ రామబాణం కూడా ఇదే తరహాలో వచ్చిన సినిమా. లక్ష్యం, లౌక్యం లాంటి సినిమాల తర్వాత మరోసారి రొటీన్ కాన్సెప్ట్ తో శ్రీవాస్ ఈ సినిమాను తీసుకొచ్చాడు. సినిమా మొదలైన తొలి పదినిమిషాల్లోనే హీరో ఏం చేస్తాడు ఎందుకు వెళ్లిపోయాడు అనే క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత కుటుంబం కష్టాల్లో ఉంది అని తెలుసుకొని రావడం.. ఒక్కొక్కటిగా హీరో ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్లడం జరుగుతుంది. ఇంటర్వెల్ ఫైట్ కాస్త ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఫస్ట్ అఫ్ అంత పూర్తిగా యాక్షన్ అక్కడక్కడ కామెడీతో నింపేశాడు దర్శకుడు. సెకండాఫ్ పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ తో కవర్ చేయాలని చూసాడు. మధ్యలో ఆర్గానిక్ ఫుడ్ అనే టాపిక్ తీసుకొచ్చాడు. కాకపోతే అది కూడా అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ అవలేదు. కథ మరీ రొటీన్ గా ఉండడం.. లక్ష్యంలా అటు ఎమోషన్ పండలేదు.. లౌక్యంలా ఇటు కామెడీ వర్కౌట్ కాలేదు. మధ్యలో ఆగిపోయింది రామబాణం. దానికి తోడు స్క్రీన్ ప్లే లోపం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది. డింపుల్ హయతితో వచ్చే లవ్ సన్నివేశాలు.. పాటలు ఇరికించినట్లు ఉన్నాయి.

నటీనటులు:

గోపీచంద్ ఈ తరహా పాత్రలు చేయడం ఇది మొదటిసారి కాదు. కెరీర్ మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నాడు. రామబాణంలో కూడా కొత్తగా ఏమనిపించలేదు. తనకు అలవాటు అయిన పాత్రలు ఇరగదీసాడు. జగపతిబాబు క్యారెక్టర్ బాగుంది. డింపుల్ హయాతి గ్లామర్ షోతో ఆకట్టుకుంది. కుష్బూ తన పాత్రకు న్యాయం చేశారు. అలీ, సత్య, గెటప్ శ్రీను కామెడీ పర్లేదు. విలన్స్ గా నాజర్, తరుణ్ అరోరా రొటీన్ అయిపోయారు.

టెక్నికల్ టీం:

మిక్కీ జే మేయర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటల్లో మోనాలిసా పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. భూపతి రాజా కథ మరి ఓల్డ్. శ్రీవాస్ డైరెక్షన్ రొటీన్ గా ఉంది. స్క్రీన్ ప్లే మరింత రొటీన్.

పంచ్ లైన్:

రామబాణం.. మధ్యలోనే ఆగిపోయింది..