Pawan Kalyan: పవన్‌కు స్వాగతం పలికిన బాలయ్య.. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన ఫ్యాన్స్

తాజాగా పవన్ కళ్యాణ్ .. నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు గెస్ట్ గా హాజరవుతారని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఆనందం డబుల్ అయ్యింది. ఇండియాలో టాప్ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య అన్ స్టాపబుల్ విజయవంతంగా మొదటి సీజన్ పూర్తి చేసుకొని సెకండ్ సీజన్ లోకి అడుగుపెట్టింది.

Pawan Kalyan: పవన్‌కు స్వాగతం పలికిన బాలయ్య.. సీఎం సీఎం అంటూ నినాదాలు చేసిన ఫ్యాన్స్
Balakrishna, Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 27, 2022 | 2:40 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్ కు పూనకాలే. ఇక ఇప్పుడు అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్. తాజాగా పవన్ కళ్యాణ్ .. నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు గెస్ట్ గా హాజరవుతారని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఆనందం డబుల్ అయ్యింది. ఇండియాలో టాప్ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య అన్ స్టాపబుల్ విజయవంతంగా మొదటి సీజన్ పూర్తి చేసుకొని సెకండ్ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ లో చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. తాజాగా బాలయ్య షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నేడు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.

అయితే పవన్ వస్తున్నారని తెలుసుకున్నా ఫ్యాన్స్  అన్నపూర్ణ స్టూడియోకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ వాహనం రాగానే ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నిందలు చేశారు. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికే సమయంలో పవన్ ఫ్యాన్స్ ఇలా సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇక బాలయ్య పవన్ కలిసి ఎలాంటి విషయాలు చర్చించారు. బాలయ్య పవన్ ను ఎలాంటి  ప్రశ్నలు అడిగారు. పవన్ చెప్పిన సమాదానాలు ఏంటి అనేది తెలుసుకోవడనికి ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు, అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..