KGF Star Yash: ‘నాకు కొంత సమయం కావాలి.. కాస్త ఓపిక పట్టండి’.. అభిమానులకు యశ్ విజ్ఞప్తి..

. జనవరి 8న తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా శుభవార్త వినిపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు యశ్. తన బర్త్ డేకు ఇక్కడ ఉండడం లేదని.. అందరినీ కలుసుకోలేనని చెప్పుకొచ్చారు యశ్.

KGF Star Yash: 'నాకు కొంత సమయం కావాలి.. కాస్త ఓపిక పట్టండి'.. అభిమానులకు యశ్ విజ్ఞప్తి..
Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2023 | 7:31 AM

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు రాకింగ్ స్టా్ర్ యశ్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఫ్యాన్స్ అంతా ముద్దుగా రాకీ భాయ్ అని పిలిచుకునే యశ్..కేజీఎఫ్ 2 తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. తమ హీరో నెక్ట్స్ మూవీ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 8న తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా శుభవార్త వినిపిస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు యశ్. తన బర్త్ డేకు ఇక్కడ ఉండడం లేదని.. అందరినీ కలుసుకోలేనని చెప్పుకొచ్చారు యశ్.

“నా అభిమానులే నా బలం..నా పుట్టినరోజు సందర్భంగా ఏడాది పొడవున మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను ప్రదర్శించడానికి చేస్తున్న కృషి నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపుతోంది. అన్ని రోజుల్లానే పుట్టిన రోజూ నాకు సాధారణమే. దాన్ని ప్రత్యేకంగా చూడను. కానీ మీరంతా పరిచయమైన దగ్గర నుంచి ఈరోజు ప్రత్యేకంగా మారింది. నేను మరింత ఎక్కువగా ఆలోచించేందుకు కారణం మీ ప్రోత్సహమే.

ఇవి కూడా చదవండి

ఓ ప్రాజెక్ట్ విషయంలో ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నాను. ఆ వివరాలు మీకు చెప్పేందుకు నాకు కొంత సమయం కావాలి. అప్పటి వరకు ఓపిక పట్టండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. అదే ఈ ఏడాది పుట్టిన మీరు నాకు ఇచ్చే కానుక. మాటిస్తున్నాను. మిమ్మల్ని నిరాశ పరచను. జనవరి 8న నేను ఇక్కడ ఉండడం లేదు. మీ అందరినీ కలుసుకోలేను. కానీ ప్రతి ఒక్కరి విష్ నాకు చాలా విలువైంది. ” అంటూ యశ్ పేర్కొన్నారు. ఇక ఈ స్టార్ లెటర్ పై భిన్నంగా స్పందిస్తున్నారు యశ్.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.