Krishna Vamsi: ప్లీజ్ సార్.. ఆ సినిమాను రీరిలీజ్ చేయండి.. నెటిజన్ రిక్వెస్ట్‏కు దండం పెట్టేసిన డైరెక్టర్ కృష్ణవంశీ..

మాస్ మాహారాజా రవితేజ, సంఘవి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం సింధూరం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో న్యాచురల్ గా తెరకెక్కించిన ఈ సినిమా 1997 సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా భారీగా నష్టాలు మిగిల్చింది.

Krishna Vamsi: ప్లీజ్ సార్.. ఆ సినిమాను రీరిలీజ్ చేయండి.. నెటిజన్ రిక్వెస్ట్‏కు దండం పెట్టేసిన డైరెక్టర్ కృష్ణవంశీ..
Krishna Vamsi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 05, 2023 | 6:34 AM

ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ పుట్టినరోజు.. స్పెషల్ డేస్ సందర్భంగా పలు హిట్ చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఒక్కడు, జల్సా, ఖుషి, నువ్వే నువ్వే వంటి హిట్ చిత్రాలు మళ్లీ విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ క్రమంలోనే తమకు నచ్చిన ఓ సినిమాను రీరిలీజ్ చేయాలని దర్శకుడు కృష్ణవంశీని రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ సినిమా అప్పులు ఐదేళ్లు కట్టానంటూ ఏకంగా దండం పెట్టేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మాస్ మాహారాజా రవితేజ, సంఘవి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం సింధూరం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో న్యాచురల్ గా తెరకెక్కించిన ఈ సినిమా 1997 సెప్టెంబర్ 12న విడుదలై పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా భారీగా నష్టాలు మిగిల్చింది.

ఈ చిత్రానికి అటు దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతలలో ఒకరిగానూ కొనసాగారు కృష్ణవంశీ. ఇక తాజాగా ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సింధూరం సినిమాను రిలీజ్ చేయాలని కోరారు.. “కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలామంది4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్…. దయచేసి ఈ మా ఆశ నెరవేర్చాలని కోరుతున్నాము సార్..”నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సిందూరం”..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం. ” అంటూ ట్వీట్ చేశారు. అయితే అతడి రిక్వెస్ట్ కు కృష్ణవంశీ స్పందించారు. అమ్మో ఈ సినిమా కోసం చేసిన అప్పులు ఐదేళ్లు కట్టానయ్యా.. వామ్మో అంటూ దండం పెట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్స్ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆయన రంగమార్తాండ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వినిపించిన షాయరీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.