Bedurulanka 2012: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘బెదురులంక 2012’.. టికెట్ల ధరలు భారీగా తగ్గింపు.. ఎంతంటే?
ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు యంగ్ హీరో కార్తికేయ. హిప్పి, గుణ 369, 90ఎమ్‌ఎల్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ నటనకు ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజా విక్రమార్క కూడా నిరాశపర్చింది. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వెరైటీ కథతో ముందుకొస్తున్నాడీ యంగ్ హీరో. కార్తికేయ నటించిన తాజా చిత్రం 'బెదురు లంక 2012.
ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు యంగ్ హీరో కార్తికేయ. హిప్పి, గుణ 369, 90ఎమ్‌ఎల్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. చావు కబురు చల్లగా సినిమాలో కార్తికేయ నటనకు ప్రశంసలు దక్కినా కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజా విక్రమార్క కూడా నిరాశపర్చింది. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వెరైటీ కథతో ముందుకొస్తున్నాడీ యంగ్ హీరో. కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘బెదురు లంక 2012. డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కథానాయిక. 2012 యుగాంతం నేపథ్యంలో ఒక పల్లెటూరులో జరిగిన సంఘటనల ఇతి వృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ బెదురులంక సినిమాపై అంచనాలను పెంచేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 25) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలకు సంబంధించి బెదురులంక టీమ్ మూవీ లవర్స్‌కు స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. తమ సినిమా టికెట్ ధరలను తగ్గించినట్లు అధికారికంగా తెలిపింది. సవరించిన ధరల ప్రకారం మల్టీప్లెక్స్‌ల్లో రూ. 350 టికెట్‌ను రూ. 250కు, రూ. 295 టికెట్‌ను రూ. 200కు, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 టికెట్‌ను రూ. 150కు, రూ. 150 టికెట్‌ను రూ. 110కు, రూ. 80 టికెట్‌ను రూ. 50కు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ఆన్‌లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
బెదురులంక సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ సినిమాను నిర్మించారు. కార్తికేయ, నేహాతో పాటు ఎల్బీ శ్రీరామ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గోపరాజు రమణ, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శీను తదితరులు నటించారు. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామచరణ్ రిలీజ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
రామ్ చరణ్ తో బెదురులంక 2012 మూవీ టీమ్
View this post on Instagram
కార్తికేయ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
నేహా శెట్టి ఇన్ స్టాగ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..