Jabardasth: సిల్వర్ స్క్రీన్‌పై బిజీబిజీగా జబర్దస్త్ ఆర్టిస్టులు.. హీరోలు, డైరెక్టర్లుగా ఛాన్స్‌లు..
నటులుగా ఎదగాలన్న ఎంతోమందికి తమ ట్యాలెంట్‌ను పరిచయం చేసేందుకు ఒక చక్కని వేదికగా నిలిచింది. మొదట కంటెస్టెంట్లుగా అడుగుపెట్టి, ఆ తర్వాత టీమ్ లీడర్లుగా ఎదిగి, ఆపై వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బలగం సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టిన వేణు యెల్దండి ఒకప్పటి జబర్దస్త్ కమెడియనే. వేణులాగే ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్లు హీరోలుగా, డైరెక్టర్లుగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.
జబర్దస్త్.. బుల్లితెరపై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు 13 ఏళ్ల నుంచి టీవీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ కడుపుబ్బా నవ్విస్తోంది. షో కంటెంట్‌పై అప్పుడప్పుడు విమర్శలు వచ్చినా జబర్దస్త్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు నటులుగా ఎదగాలన్న ఎంతోమందికి తమ ట్యాలెంట్‌ను పరిచయం చేసేందుకు ఒక చక్కని వేదికగా నిలిచింది. మొదట కంటెస్టెంట్లుగా అడుగుపెట్టి, ఆ తర్వాత టీమ్ లీడర్లుగా ఎదిగి, ఆపై వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బలగం సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టిన వేణు యెల్దండి ఒకప్పటి జబర్దస్త్ కమెడియనే. వేణులాగే ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్లు హీరోలుగా, డైరెక్టర్లుగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వీరిలో అందరికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్ గురించి. బుల్లితెరపై తనదైన యాంకరింగ్, యాక్టింగ్‌తో అదరగొట్టిన ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాల్లో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. గాలోడు మూవీతో ఫస్ట్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో కాలింగ్ సహస్ర, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) అనే సినిమాలు ఉన్నాయి.
వెండితెరపై బిజీబిజీగా..
జబర్దస్త్ నుంచే వచ్చిన షకలక శంకర్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే పలు మూవీస్‌లో కమెడియన్‌గా ఆకట్టుకున్నాడు. ఇక ఈ మధ్యన తరచూ సినిమాల్లో కనిపిస్తున్నాడు గెటప్ శ్రీను. బుల్లితెర కమల్ హాసన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శీను ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఖైదీ నెంబర్ 150తో మొదలు లేటెస్ట్ భోళాశంకర్ వరకు చిరంజీవి రీఎంట్రీలో నటించిన సినిమాలన్నింటీలో గెటప్ శీను నటించడం విశేషం. ఇక హీరోగా రాజుయాదవ్ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ఇక హైపర్ ఆది కూడా ఈ మధ్యన ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నాడు. కమెడియన్ రోల్స్‌తో పాటు స్పెషల్ రోల్స్‌లోనూ సందడి చేస్తున్నాడు. వీరితో పాటు ధనాధన్ ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర, రాకేట్ రాఘవ, ముక్కు అవినాష్, బుల్లెట్ భాస్కర్, తాగుబోతు రమేష్, కెవ్వు కార్తీక్, ఇమ్మాన్యుయేల్, రాకింగ్ రాకేష్, కూడా సిల్వర్ స్క్రీన్‌పై కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇక వేణు లాగే జబర్దస్త్ శాంతికుమార్ డైరెక్టర్‌గా మారనున్నాడు. సీనియర్ నటులు సాయి కుమార్ ప్రధాన పాత్రలో నాతో నేను అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇక జబర్దస్త్ యాంకర్‌గా మెప్పించిర రష్మీ గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయిన్‌గా మెప్పించింది. ఇటీవల భోళాశంకర్ లోనూ మెరిసింది. మొత్తానికి నటులుగా ఎదగాలన్న వారికి చక్కని వేదికగా నిలుస్తోంది జబర్దస్త్.
రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫొటోస్
View this post on Instagram
సుడిగాలి సుధీర్ లేటెస్ట్ ఫొటోస్
View this post on Instagram
హైపర్ ఆది లెటెస్ట్ ట్విట్టర్ పోస్ట్
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు ❤️🫂#HBDMegastarChiranjeevi pic.twitter.com/Vepb6wk3Eh
— Hyper Aadi™ (@ComedianAadi) August 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..